Sunday, October 6, 2024

నేడు పిసిసి చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్ బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కొత్త పిసిసి అధ్యక్షుడు మ హేశ్ కుమార్ గౌడ్ కోసం గాంధీభవన్ ముస్తాబయ్యింది. మహేశ్ కుమార్ గౌడ్ నేడు (ఆదివారం) మధ్యాహ్నం పద వీ బాధ్యతలను పిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్‌రెడ్డి నుంచి ఈ బాధ్యతలను తీసుకోనున్నారు. ముందుగా పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం 12 గంటలకు భా రీ ర్యాలీగా బయలుదేరి అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగా ణ అమరవీరుల స్తూపం వద్ద ఉన్న గన్‌పార్క్ వద్దకు చేరుకుంటారు. అక్కడ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడ నుంచి గాంధీ భవన్‌కు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా బయలుదేరుతారు. మధ్యాహ్నం సుమారు 2 గంటలకు గాంధీ భవన్‌కు ఆయన చేరుకుంటారు.

అక్కడ 2.45 నిమిషాలకు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి ప్రస్తుత టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నుంచి మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం తర్వాత ఇందిరా భవన్ ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సి ఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, రా ష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ, మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని పిసిసి వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరి 29వ తేదీన తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కో టాలో మహేష్ గౌడ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా, ప్రస్తుతం ఆయన టిపిసిసి చీఫ్ పదవిని ఆదివారం నాడు స్వీకరించబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News