Friday, March 29, 2024

రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతర ణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీసులు సురక్షా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పెట్రోల్ కార్లు, బ్లూకోల్ట్ ర్యాలీ, టెక్నాలజీ ఎగ్జిబిషన్, ఉమెన్ సేఫ్టీ కార్నివాల్, ఫుట్ మార్చ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల వల్ల సాధారణ ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆదివారం నగరంలో ట్రాపిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు.
కొన్ని ప్రాంతాల్లో మళ్లింపులు, నిలిపివేత, రోడ్లను మూసివేయనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమలులో ఉండనున్నాయి.
పెట్రోల్ కారు లేదా బ్లూకోల్ట్ ర్యాలీ సంజీవయ్య పార్క్ నుంచి చార్మినార్ వరకు నిర్వహించనున్నారు. తిరిగి అదేదారిలో రానున్నది.
పార్కింగ్ ప్రాంతాలు…
నెక్లెస్ రోడ్డు నుంచి మింట్ కాంపౌండ్ వరకు సింగిల్ లేన్, ఎన్‌టిఆర్ ఘాట్, ఎన్‌టిఆర్ గార్డెన్, రేస్‌కోర్సు రోడ్డు.
ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్నివాల్…
ఉమెన్‌సేఫ్టీ కార్నివాల్‌ను సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్నారు. ఈ సమయంలో ట్యాంక్‌బండ్‌పైకి వాహనాలను అనుమతించరు.
లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లే వాహనాలను అంబేద్కర్ విగ్రహం మీదుగా తెలుగుతల్లి, ఇక్బాల్‌మినార్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.
తెలుగుతల్లి నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం నుంచి లిబర్టీ, హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు.
కర్బాలా మైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వెపు వాహనాలను అనుమతించరు. సేయిలింగ్ క్లబ్ మీదుగా కవాడిగూడ డిబిఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.
డిబిఆర్ మిల్స్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వాహనాలను అనుమతించకుండా, డిబిఆర్ మిల్స్ మీదుగా గోశాల, కవాడిగూడ, జబ్బార్ కాంప్లెక్స్, బైబిల్ హౌస్ వైపు మళ్లిస్తారు.
ఇక్బాల్ మినార్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను ఓల్డ్ సెక్రటేరియట్ నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వయా కట్టమైసమ్మ, లోయర్ ట్యాంక్‌బండ్, డిబిఆర్ మిల్స్, కవాడిగూడ వైపు వెళ్లాలి.
పార్కింగ్ ప్రాంతాలు…
అంబేద్కర్ విగ్రహం నుంచి లేపాక్షీ, బిఆర్‌కు భవన్ రోడ్డు ఎదురుగా, బుద్ద భవన్ బైక్‌సైడ్ మీదుగా పివిఎన్‌ఆర్ మార్గ్, సేయిలింగ్ క్లబ్ నుంచి చిల్డ్రన్ పార్క్, ఎన్‌టిఆర్ గ్రౌండ్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్‌స, ఆదర్శనగర్.
ఫుట్ మార్చ్‌ను ఎంజే మార్కెట్ నుంచి చార్మినార్ వరకు నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి 11గంటల వరకు ఫుట్‌మార్చ్ నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News