Sunday, February 16, 2025

పంపకాలపై పేచీలొద్దు

- Advertisement -
- Advertisement -

సానుకూల వాతావరణంలోనే ఆస్తులు, అప్పుల పంపకాలు
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్
సూచన విభజన చట్టంలోని 9,10షెడ్యూళ్లపై రెండేళ్ల తరువాత
సుదీర్ఘ చర్చ విదేశీ సంస్థల నుంచి తీసుకున్న అప్పులపై కీలక
చర్చ ఇరురాష్ట్రాల ఏజీల అభిప్రాయం మేరకు వచ్చే
సమావేశంలో నిర్ణయం 9,10 షెడ్యూళ్లలోని 20 సంస్థల
నిధుల పంపకాలపై సానుకూలంగా ఉండాలని సూచన
ఎక్కువ వాటాలకు పట్టుబడితే ఇరుపక్షాలకు నష్టమని తేల్చి
చెప్పిన గోవింద మోహన్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర విభజన అం శాలపై ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో సోమవారం కీలక సమావేశం జరిగింది. హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమా వేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీలు శాంతికుమారి, విజయానంద్‌లతో పాటు ఇరు రా ష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని ప్రధానాంశాలపై అ ధికారులు చర్చించారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. ఇటీవల కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐ ఎఎస్ అధికారి గోవింద్ మోహన్ తొలిసారి ఎపి వి భజన చట్టంపై సమీక్ష చేపట్టారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత విభజన చట్టం అమలుపై కేంద్రహోంశాఖ కార్యదర్శి లోతుగాసమీక్షించారు. విభజన చట్టం 9,10షెడ్యూల్‌లో పేర్కొన్న సం స్థల విభజన, ఆస్తులు, అప్పుల పంపకాలపై ఎక్కువ చ ర్చ జరిగినట్లు సమాచారం.

ఇరు రాష్ట్రాలు సమన్వ యంతో అన్ని సమస్యలు పరిష్కరించు వాలని, ప్ర స్తుత ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో ఉన్నా యన్నట్లు వెల్లడించారు.వాతావరణం సానుకూలం గా ఉన్నప్పుడే సమస్యలు కూడా త్వరగా పరిష్కా రం అవుతాయని అధికార వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. విదేశీ సంస్థల నుంచి ఉమ్మడి రాష్ట్రం లో తీసుకున్న అప్పుల వ్యవహారంలో న్యాయ సల హా ప్రకారం వెళ్లాలని హోం శాఖ కార్యదర్శి సూ చించారు. దీనికి ఇరు రాష్ట్రాలు తమ అడ్వకేట్ జన రల్ నుంచి అభిప్రాయం తీసుకుంటామని చెప్పగా, త్వరగా తీసుకోవాలని హోం కార్యదర్శి చెప్పినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల ఎజిలు చెప్పే అభిప్రా యానికి అనుగుణంగా తదుపరి భేటీలో ఒక ని ర్ణయం తీసుకుందామని వెల్లడించిన హోం శాఖ కా ర్యదర్శి. విభజన, ఆస్తులు, అప్పుల పంపకాల వి షయంలో రెండు రాష్ట్రాలకు హోం కార్యదర్శి కీలక సూచనలు చేసినట్లు సమాచారం. 20 సంస్థలకు సంబంధించిన నిధుల పంపకాల్లో ఉన్న సమస్యల పై ఇరువురు సానుకూల దృక్పదంతో ఉండాలని కేంద్ర హోం కార్యదర్శి తెలిపారు. రాష్ట్ర ఉన్నతా ధికారుల స్థాయిలోనే అవకాశం ఉన్నంత వరకు పరిష్కారానికి ప్రయత్నం చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వాధినేతతో చర్చించి కొలిక్కి తీసుకురావాలని సూచించారు.

తమకే ఎక్కువ రావాలని ఇద్దరూ పట్టుపడితే, ఇద్దరికీ నష్టం వస్తుందని హితవు పలికినట్లు సమాచారం. ఒకరి అభిప్రాయం మరొకరు కాదని కోర్టుకు వెళితే, కేంద్రంగా తాము ఏమీ చేయలేమని, ఎప్పటికి తేలుతుందో కూడా చెప్పలేని పరిస్థితి రావొచ్చని హోం శాఖ కార్యదర్శి అన్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో మౌలిక వసతుల ప్రాజక్టులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ స్పష్టం చేసినట్లు సమాచారం. తెలంగాణ ప్రత్యేక అంశాలుః వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంటు, 13 షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థలు, మౌలిక వసతులు ప్రాజక్టులు, హార్టి ల్చర్, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ది, అవసరమైన బొగ్గు సరఫరాతో రాష్ట్రంలో 4వేల మెగావాట్ల విద్యుత్ సదుపాయాలు, రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటు.

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అంశాలుః గ్రేహౌండ్స్ కేంద్రం ఏర్పాటు, కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారం, వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి గ్రాంటు, కేంద్ర సాయం తర్వాత కూడా ఉన్న రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజక్టు నిర్మాణం, 13 షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థలు, మౌలిక వసతులు ప్రాజక్టులు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, దుగరాజపట్నం పోర్టు నిర్మాణం, కడప జిల్లాల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పెట్రోలియం రిఫైనరీ, ప్రెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు, కొత్త రాజధాని నుంచి హైదరాబాద్ సహా ప్రధాన నగరాలకు రోడ్ల అనుసంధానం, ర్యాపిడ్ రైలు కనెక్టివిటీ, ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ తరహాలోనే విశాఖ-చెన్నై కారిడార్ ఏర్పాటు, విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా విస్తరణ, కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖపట్నం, విజయవాడ–గుంటూరు–తెనాలి మెట్రో రైలు నిర్మాణం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News