Saturday, May 3, 2025

ప్రేమపెళ్లి?… యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగిన హిజ్రా

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు ట్రాన్స్‌జెండర్‌ను నమ్మించి మోసం చేశాడు. దీంతో ట్రాన్స్‌జెండర్ యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేవ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బైచిగేరి గ్రామానికి చెందిన గణేష్‌కు గత సంవత్సరం ట్రాన్స్‌జెండర్ హసీనా గౌడు పరిచయమైంది. ప్రేమ పేరుతో హసీనాను గణేష్ బుట్టలో పడేశాడు. సదరు ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకొని యువకుడు కలిసి ఉంటున్నాడు. సొంతూరుకు వెళ్లి వస్తానని హసీనా చెప్పి అతడు వెళ్లిపోయాడు.

అప్పటి నుంచి యువకుడు ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో హసీనా మరో నలుగురు హిజ్రాలతో కలిసి అతడి ఇంటికి వెళ్లారు. యువకుడి ఇంటి ముందు ధర్నా చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఐదుగురు ట్రాన్స్‌జెండర్లను ఆదోని గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. గతంలో హైదరాబాద్ లో ఇద్దరు విషయంలో పోలీసులు కేసు నమోదు చేశారని, కోర్టులో విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. గ్రామానికి వచ్చి ఇలా చేయడం సరికాదని ట్రాన్స్‌జెండర్లకు పోలీసులు సర్దిచెప్పారు. గణేష్ చదువుకు తానే ఖర్చు చేశానని, 15 లక్షలు తన దగ్గర అప్పుగా తీసుకున్నాడని హసీనా ఆరోపణలు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు సంవత్సరాల క్రితం పరిచయమయ్యాడని హసీనా వివరణ ఇచ్చింది. తనకు ఆరోగ్యం బాగోలేదని, ఫిట్స్ కూడా వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News