Monday, January 30, 2023

ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ కొరడా

- Advertisement -

సంక్రాంతి పండగ సందర్భంగా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు, ఇతర వాహనాల్లో వసూలు చేసే అధిక ఛార్జీల నివారణకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ చర్యలు ప్రారంభించింది. పండుగ రద్దీ వేళ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు తనిఖీ చేయాలని అధికారులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కీలక ఆదేశాలు మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రవాణాశాఖ, టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో అధికారులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా ఈ తనిఖీలు చేపట్టారు.

సంక్రాంతి సమయంలో అధిక చార్జీలు వసూలు చేస్తే కఠినచర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పండుగ వేళ ప్రమాదాలు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ. ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణా శాఖ, టీఎస్ఆర్టీసీ తనిఖీలు చేస్తుండగా నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేట్ వాహనాలు సీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్ దగ్గర ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే, ఇప్పటివరకు మొత్తం 28 వాహనాలు సీజ్ చేసినట్లు ఆర్టీఏ వెల్లడించింది. ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరేందుకు ఈ రైడ్స్ చేపట్టిన అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles