Saturday, August 16, 2025

అప్పుడు ట్రంప్ ఉంటే యుద్ధం జరిగేది కాదు: పుతిన్

- Advertisement -
- Advertisement -

అలాస్కా: ఉక్రెయిన్ యుద్ధంపై చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాస్కాలో జరిగి సమావేశం ముగిసింది. అలాస్కాలో రెడ్ కార్పెట్ లో పుతిన్ అమెరికా అధ్యకుడు ట్రంప్ ఘన స్వాగతం పలికారు. పుతిన్ ట్రంప్ వైపు నడుస్తూ రాగానే అమెరికా అధ్యక్షుడు ఆయనకు మూడుసార్లు చప్పట్లు కొట్టి స్వాగతం పలకడంతో షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇద్దరు స్నేహభావంతో నవ్వులతో ఒకరిని ఒకరు పలకరించుకున్నారు. ఈ సమావేశం ముగిసిన తరువాత పుతిన్ మీడియాతో మాట్లాడారు. 2022లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడి ఉండి ఉంటే ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం జరిగి ఉండేది కాదన్నారు. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించేందుకు ఆసక్తి చూపిస్తున్నానని, కానీ ఈ సంక్షోభానికి కారణమైన మూల అంశాలను పరిష్కరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్ చేశారు.

ఉక్రెయిన్ కు భద్రత కల్పించాలన్న ట్రంప్‌ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని ఆయన చెప్పారు.  అలాస్కా శిఖరాగ్ర సమావేశం తరువాత రెండో భేటీ మాస్కోలో జరిగే అవకాశముందని తెలియజేశారు. ఇద్దరు నేతలు మీడియా ప్రశ్నలకు స్పందించకుండా గదిని విడిచే ముందు, రెండో సమావేశం ఎప్పుడు జరుగుతుందనేది అధికారికంగా ప్రకటించలేదు. గతంలో రష్యా అమెరికా దేశాల మధ్య చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయని, ప్రస్తుతం ఇరు దేశాలు మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యూరోప్ నేతలతో మాట్లాడిన తరువాత పుతిన్ తో మళ్లీ చర్చలు జరుపుతానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News