Sunday, April 28, 2024

గుడ్ న్యూస్.. 11,062 టీచర్ పోస్టులతో డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతగానో ఎదురుచూస్తున్న డిఎస్‌సి నోటిఫికేషన్‌ ను గురువారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన 5,089 ఉపాధ్యాయ పోస్టుల డిఎస్‌సి నోటిఫికేషన్‌ను బుధవారం రద్దు చేసిన విద్యాశాఖ… ఈరోజు మొత్తం 11,062 టీచర్ పోస్టులతో మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో.. స్కూల్ అసిస్టెంట్ 2629, లాంగ్వేజ్ పండిట్ 727, ఎస్‌జీటీ 6508, పీఈటీ 182 పోస్టులు ఉన్నాయి. మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.

2023లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా, మొత్తం 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 నవంబరు 20 నుంచి 30వ తేదీ మధ్యలో రాతపరీక్ష నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పరీక్ష వాయిదా పడ్డాయి. తాజాగా పాత డిఎస్‌సి 2023 నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News