Wednesday, March 26, 2025

పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.కృష్ణారావు తెలిపారు. హాల్ టికెట్లను డిఇఒల ద్వారా పాఠశాలలకు పంపించామని, ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులు హాల్ టికెట్లు పొందాలని తెలిపారు. వివిధ కారణాలతో పాఠశాలల యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం 040 23230942 ఫోన్ నెంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,544 పాఠశాలల నుంచి 4.97 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News