Friday, April 19, 2024

30 ఏళ్ల నాటి అండాలతో కవలల జననం

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : వైద్య అత్యద్భుతాలలో మరో పుట చేరింది. అమెరికాలోని టెన్నిసి రాష్ట్రంలో 30 ఏళ్ల క్రితం నాటి ఘనీభవించిన అండాలతో ఓ మహిళకు కవల పిల్లలు జన్మించారు. పండంటి ఈ బిడ్డలను సదరు ఒరెగాన్ దంపతులు తమ సంతానంగా ఆహ్వానించారు. ఈ అండాలను 1992 ఎప్రిల్‌లో అంటే 30 ఏళ్ల క్రితం ఫ్రిజ్‌లో దాచి ఉంచారు. ఇప్పుడు ఈ అండాలకు తన గర్భాశయంలో నెలలు మోసిన తల్లి ప్రసవించిందని సిఎన్‌ఎన్ తెలిపింది.

ఇంతకు ముందు ఈ విధమైన ఫ్రోజెన్ ఎంబ్రాయిస్ ద్వారా 2020లో మోలీ గిబ్సన్ ప్రసవం జరిగింది. అప్పుడు 27 ఏండ్ల కిందటి అండాల ద్వారా జననం జరిగింది.ఈ రికార్డును ఛేదిస్తూ ఇప్పుడు ఈ 30 ఏళ్ల అండాల ద్వారా పుట్టిన కవలలను ఇప్పుడు అంతా ప్రపంచపు పెద్దవయస్సు శిశువులని పేర్కొంటున్నారు. అమెరికాలోని జాతీయ ఎంబ్రాయ్ డొనేషన్ సెంటర్ అధికారులు ఈ కవలల జననం గురించి తెలిపారు.

ఈ కవలలకు లిడియా, టిమోతీ రిడ్గేవేగా పేరు పెట్టారని వివరించారు. కవలల్లో లిడియా ఆడశిశువు. ఐదు పౌండ్ల ,11 ఔన్స్పులు(రెండున్నర కిలోలు). ఇక మగశిశువు టిమోతీ 6 పౌండ్ల 7 ఔన్సులు ( 2.92కిలోలు). రేచల్ రిడ్జ్‌వే అనే మహిళకు ఇంతకు ముందే నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే ఈ మహిళ మరీ ముచ్చటపడి ఈ కృత్రిమ గర్భధారణకు దిగి అక్టోబర్ 31న ఈ కవలలకు తల్లి అయ్యి మరింత మురిసిపోతోంది. ఈ కవలలకు మూలమైన అండాలను ద్రవరూప నైట్రోజన్‌లో మైనస్ 128 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో పదిలపర్చారు. 30 ఏళ్ల తరువాత ఈ అండాలు కొత్త జీవిత చరిత్రను సృష్టించాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News