Friday, April 19, 2024

వచ్చే వారం వరకు ట్విట్టర్ ఆఫీస్‌ల మూసివేత

- Advertisement -
- Advertisement -
ఉద్యోగుల రాజీనామాలు వెల్లువెత్తడంతో కంపెనీ నిర్ణయం

న్యూయార్క్ : ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత బిలియనీర్ ఎలోన్ మస్క్ కంపెనీలో తరచూ మార్పులు, ఉద్యోగాల కోతలు చేపడుతుండడంతో సిబ్బంది విసిగిపోయారు. ‘చాలా కష్టపడాలని, లేకపోతే వెళ్లిపోండి’ అంటూ గురువారం మస్క్ అల్టిమేటమ్ జారీ చేశారు. మస్క్ తీరుతో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రాజీనామా సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీంతో వచ్చే వారం వరకు ట్విట్టర్ ఆఫీస్‌లను మూసివేస్తున్నట్టు కంపెనీ ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది.

సోమవారం(నవంబర్ 21) మళ్లీ ఆఫీస్‌లను తిరిగి ఓపెన్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఎందుకు అనేది కంపెనీ చెప్పలేదు. అయితే గురువారం కొత్త బాస్ ఎలోన్ మస్క్ అల్టిమేటర్ జారీ చేస్తూ పంపిన ఇమెయిల్ కారణంగానే ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వైదొలిగేందుకు సిద్ధమయ్యారని, ఈ నేపథ్యంలోనే కంపెనీ ఆఫీస్‌ల మూసివేత ప్రకటన చేసిందని తెలుస్తోంది.

ఇప్పటికే మస్క్ కంపెనీలో సగం మందిపై వేటు వేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా తొలగించారు. ఇప్పుడు ఉద్యోగుల అంతా 8 గంటల పనిచేయాలని, దీని సమ్మతమైతే ‘యస్’ అని సమాధానం ఇవ్వాలని, లేకపోతే మీరు కంపెనీ నుంచి బయటి వెళ్లాల్సి వస్తుందంటూ మస్క్ జారీ చేసిన అల్టిమేటమ్ పట్ల ఉద్యోగులకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News