Tuesday, March 5, 2024

కేరళలో అమెరికన్ మహిళపై అత్యాచారం: ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

కొల్లం(కేరళ): కేరళలోని కొల్లం జిల్లాలో ఒక అమెరికన్ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

44 సంవత్సరాల అమెరికన్ మహిళ కొల్లం నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని కరునగపల్లి సీపంలో ఉన్న మాతా అమృతానందమయి ఆశ్రమాన్ని సందర్శించిన సందర్భంగా ఈ దారుణం జరిగింది. జులై 31న ఆ మహిళ ఆశ్రమం సమీపంలోని బీచ్ వద్ద ఒంటరిగా కూర్చుని ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె వద్దకు వచ్చిన ఇద్దరు స్థానిక యువకులు సిగరెట్లు, మద్యం ఇస్తామని ప్రలోభపెట్టి, ఆమెను ఒక ఖాళీ భవనం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఆశ్రమం నిర్వాహకులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులు జయన్, నిఖిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని కరునగపల్లి సహాయ పోలీసు కమిషనర్ ప్రదీప్ కుమార్ విఎస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News