Home తాజా వార్తలు శంకర్‌పల్లిలో రైల్వే పట్టాలపై రెండు మృతదేహాలు…

శంకర్‌పల్లిలో రైల్వే పట్టాలపై రెండు మృతదేహాలు…

సంగారెడ్డి: రైలు పట్టాలపై రెండు మృతదేహాలు కనిపించిన సంఘటన సంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రైలు పట్టాలపై మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులలో యువకుడు(31), వృద్ధురాలు(65) ఉన్నట్టు గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా చంపి మృతదేహాలను ఇక్కడ పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించామని రైల్వే ఎస్‌ఐ మల్లేష్ పేర్కొన్నారు.