Sunday, September 24, 2023

నల్గొండ జిల్లాలో దారుణం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. ఇద్దరు యువతులు ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. ఎనుగుదుల మనీషా( 20), దంతబోయిన శివాని (20) నల్గొండ లోని మహిళ డిగ్రీ కళాశాలలో Bzc ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం నల్గొండ లోని రాంనగర్ రాజీవ్ పార్కులో ఇద్దరు యువతులు గడ్డి మందు తాగారు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరు యువతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.   నల్గొండ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో  ఇద్దరు యువతులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు యుతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన మనీషా,నక్కల పల్లి గ్రామానికి చెందిన శివాని గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News