Friday, May 30, 2025

కాశ్మీర్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

షోపియన్: జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా(LeT) ఉగ్రవాదులు అరెస్టు చేశారు. షోపియన్ జిల్లాలోని బాస్కుచాన్ ప్రాంతంలో భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) సందర్భంగా లష్కరే తోయిబా (LeT)కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఉగ్రవాదుల నుండి బలగాలు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నాయి.

షోపియన్‌లోని ఇమామ్ సాహిబ్ ప్రాంతంలోని బాస్కుచాన్‌లోని పండ్ల తోటలో ఉగ్రవాదుల కదలిక గుర్తించి.. ఆర్మీకి చెందిన 44 రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, 178వ బెటాలియన్ CRPF నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఇర్ఫాన్ బషీర్, ఉజైర్ సలాం ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారని పోలీసు అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News