Thursday, January 23, 2025

నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ… ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

 

మేడ్చల్: లారీ బీభత్సం సృష్టించిన సంఘటన మంగళవారం ఉదయం మేడ్చల్ జిల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు చందన్‌రామ్, చందన్ కుమార్ రాత్రి సమయంలో ఆరుబయట నిద్రిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఐరన్ లోడు వెళ్తున్న లారీ అదుపు తప్పి వారి పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News