Wednesday, June 19, 2024

సింగరేణి థర్మల్ పవర్‌కు రెండు జాతీయ అవార్డులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అత్యుత్తమ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌లో జాతీయ స్థాయిలో నెంబర్ 1 ప్లాంట్‌గా ఇప్పటికే గుర్తింపు పొందిన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను సాధించింది. కేంద్ర ఇరిగేషన్ , ఇంధన బోర్డు వారు ఢిల్లీలో శుక్రవారం రాత్రి నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి అత్యుత్తమ పనితీరు గల ప్లాంట్‌గా ప్రతిభా పురస్కార అవార్డు లభించింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ ఈ అవార్డులను సింగరేణి డైరెక్టర్ ( ఈ అండ్ ఎం) డి. సత్యనారాయరావుకు బహుకరించారు.

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యుత్తమ పిఎల్‌ఎఫ్ తో జాతీయ స్థాయిలో నెంబర్ 1 స్థానంలో నిలబడడంతో పాటు నీరు, బొగ్గు వినియోగం, కాలుష్య నివారణ చర్యల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందుకు గాను ఈ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ప్లాంట్ అవార్డును అందజేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. కాగా ఈ అవార్డు రావడం పట్ల సింగరేణి సిఎండి ఎన్. శ్రీధర్ హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యోగులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News