Saturday, April 20, 2024

ఝార్ఖండ్‌లో కొత్తగా రెండు హెచ్3ఎన్2, 5 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

రాంచీ/జెంషెడ్‌పూర్ : ఝార్ఖండ్‌లో కొత్తగా రెండు హెచ్3 ఎన్2 , ఐదు కొవిడ్ కేసులు ఆదివారం నమోదయ్యాయి. జలుబు, జ్వరంతో గురువారం జెమ్‌షెడ్‌పూర్ లోని టాటా మెయిన్ ఆస్పత్రిలో చేరిన 68 ఏళ్ల వృద్ధురాలిని పరీక్షించగా హెచ్3 ఎన్2 పాజిటివ్ అని వచ్చింది. ఆమెను ఐసొలేషన్ వార్డులో ఉంచి పరిశీలిస్తున్నామని డాక్టర్ జుఝార్ మాంఝీ చెప్పారు. రెండో కేసు రాంచీ లోని రాణీ ఆస్పత్రిలో నమోదైంది. నాలుగేళ్ల చిన్నారి హెచ్3ఎన్2 పాజిటివ్ అని పరీక్షలో తేలినట్టు రాణీ ఆస్పత్రి హెడ్ డాక్టర్ రాజేష్ సింగ్ చెప్పారు. న్యూమోనియా లక్షణాలతో ఈ చిన్నారి ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు.

ఈలోగా రాష్ట్రంలో తాజాగా మరో ఐదు కొవిడ్ కేసులు శనివారం నమోదు కావడంతో కొవిడ్ మొత్తం కేసులు పదికి చేరుకున్నాయి. రాంచీ, సింఘ్‌భమ్ జిల్లాల్లో చెరో రెండు కేసులు నమోదు కాగా, డియోఘర్‌లో ఒక కేసు నమోదైంది. అంతకు ముందు డియోఘర్, తూర్పు సింఘ్‌భమ్, లాతేహార్ జిల్లాల్లో ఒక్కో కేసు రాంచీలో రెండు నమోదయ్యాయి. తాజాగా కేసులు నమోదు కావడంతో ఝార్ఖండ్‌లో కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,42,589 కి చేరుకుంది. ఇంతవరకు 4,37చ247 మంది కోలుకున్నారు. 5332 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో ఝార్ఖండ్‌లో 926 కొవిడ్ నమూనాలను పరీక్షించారు. పరీక్షలు పెంచితే మరిన్ని కేసులు బయటపడతాయని డాక్టర్లు కొందరు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News