Sunday, March 26, 2023

ఎంఎల్ఎ గెస్ట్‌హౌజ్‌లో ఇద్దరు మృతి

- Advertisement -

నవీపేట్ : మల్కాజిగిరి శాసనసభ్యుడు అల్వార్ హన్మంత్‌రావు చెందిన గెస్ట్‌హౌజ్‌లో ఇద్దరు కూలీలు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం నవీపేట మండలం జన్నెపల్లి గ్రామంలో శానససభ్యుడు హన్మంత్‌రావుకు చెందిన గెస్ట్ హౌజ్ మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి.

శుక్రవారం మధ్యాహ్నం రెండవ అంతస్తులో కూల్చివేత పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు ఒకరు కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన చూస్తున్న మరో కూలీ గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News