Saturday, December 14, 2024

శ్రీశైలం డ్యామ్ సందర్శనకు వెళ్తుండగా కారు బోల్తా..ఇద్దరు విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం డ్యామ్ సందర్శనకు వెళ్తుండగా మార్గమధ్యలో కారు బోల్తా కొట్టిన సంఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈసంఘటన రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సిఐ కృష్ణంరాజు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ పహాడిషరీఫ్‌కు చెందిన ఇంతియాజ్‌ఖాన్ (18), నాయబ్ (18) శనివారం తన ఐదుగురు స్నేహితులతో కలిసి శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించడానికి నిర్ణయించుకుని ఒక ట్రావెల్స్‌లో మహీంద్ర ఎక్స్‌యువి 500 వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు.

రాత్రి తన స్నేహితులతో కలిసి శ్రీశైలం వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, ముచ్చర్ల గేట్ సమీపంలో కారు ఒక్కసారిగా చెట్టును ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇంతియాజ్‌ఖాన్ (18), నాయబ్ (18) తలకు రక్త గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News