Monday, July 22, 2024

బారాముల్లా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

జమ్ముకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో బుధవారం జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతాదళాలకు చెందిన ఇద్దరు గాయపడ్డారు. ఉగ్రవాదుల ఉనికిపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు బుధవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టారు. బారాముల్లా జిల్లా వాటర్‌గామ్ ఏరియాలో నలుదిక్కులా భద్రతాదళాలు చుట్టుముట్టి గాలిస్తుండగా, భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని ,ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు. సంఘటన ప్రదేశంలో రెండు మృతదేహాలు కనిపించాయని, ఎవరన్నది గుర్తించ వలసి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News