Wednesday, September 17, 2025

పట్నా పైరేట్స్ పై యు ముంబా ఉత్కంఠ విజయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రొ కబడ్డీ పోటీల్లో యు ముంబా ఉత్కంఠ విజయం సాధించింది. బుధవారం చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో ముంబా 42-40 తేడాతో పట్నా పైరేట్స్ టీమ్‌ను ఓడించింది. ఆధిపత్యం తరచు చేతులు మారుతూ సాగిన ఉత్కంఠ పోరులో పట్నాను ఆలౌట్ చేసిన యు ముంబా సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అజిత్ చవాన్ 19 పాయింట్లు సాధించి ముంబా విజయంలో కీలక పాత్ర పోషించాడు. పట్నా కూడా విజయం కోసం చివరి వరకు గట్టిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. యు ముంబా చివరి క్షణాల్లో అనూహ్యంగా విజృంభించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News