Friday, March 29, 2024

భారత్ గోధుమ ఎగుమతులను నిలిపివేసిన యూఏఈ

- Advertisement -
- Advertisement -

UAE suspends Indian wheat exports

నాలుగు నెలల పాటు కొనసాగింపు

దుబాయ్ : భారత్‌కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి, గల్ఫ్‌లో అత్యంత కీలకమైన యూఏఈ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి గోధుమలు, గోధుమ పిండి ఎగుమతులను నాలుగు నెలల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం గ్లోబల్ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే యూఏఈ దేశీయ వినియోగానికి మాత్రమే భారత్ సరఫరా చేసేందుకు అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. భారత్ నిషేధం మొదలైన మే 13 కంటే ముందే… భారత గోధుమలను యూఏఈ లోకి ఎగుమతి చేయాలనుకున్న కంపెనీలు ముందుగా ఆర్థిక మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో యూఏఈ ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా, గోధుమ ఎగుమతులపై మే 14 న భారత్ నిషేధం విధించింది. అయితే ఇప్పటికే ఎల్‌సీ (లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ) జారీ అయిన దేశాలు , ఆహార భద్రత కోసం అభ్యర్థించిన దేశాలకు మాత్రం నిషేధం నుంచి మినహాయింపునిచ్చింది. దీంతో 4,69,202 టన్నుల గోధుమ ఎగుమతులకు మాత్రమే అనుమతి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్, యూఏఈ మధ్య విస్తృత వాణిజ్యం, పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం పేరు కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ ట్రేడ్ అగ్రిమెంట్ (సీఈపీఏ). మే 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలూ పరస్పరం తమ ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించుకోవాలి. తద్వారా ఐదేళ్ల వ్యవధి లోనే వార్షిక వాణిజ్య విలువ 100 బిలియన్ డాలర్లకు చేరాలని ఇరు దేశాలూ నిర్దేశించుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News