Saturday, December 2, 2023

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు …

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఎన్సీపీ తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సిఎం అజిత్‌పవార్‌ను శివసేన నేత (యూబీటీ ) ఉద్ధవ్ థాక్రే బుధవారం కలుసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ముంబైలో జరిగిన ఈ భేటీలో శివసేన నేత ఆదిత్య థాక్రే కూడా పాల్గొన్నారు.బిజేపీ, శివసేన (షిండే) ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరిన తరువాత వీరువురు కలియడం ఇదే తొలిసారి. అయితే అజిత్ పవార్,ఉద్ధవ్ థాక్రే గతంలో మహా వికాస్ అఘాడీ (ఎంవిఎ) ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. శివసేనలో చీలిక ఏర్పడి ఎంవీఏ ప్రభుత్వం కూలిపోవడానికి ముందు ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న

సమయంలో అజిత్ పవార్ డిప్యూటీ సిఎంగా పనిచేశారు. అజిత్‌తో భేటీ తరువాత ఉద్ధవ్ థాక్రే మీడియాతో మాట్లాడారు. అజిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రజలు, రైతుల కోసం అజిత్ మంచిపనులు చేస్తారని తాను ఆశిస్తున్నానని చెప్పారు. 2019లో అజిత్‌తో కలిసి పనిచేశాను కాబట్టి అతని పనితీరు తెలుసని తెలియజేశారు. ఉద్ధవ్ థాక్రే బెంగుళూరులో రెండురోజుల పాటు జరిగిన విపక్షాల సమావేశాల్లో పాల్గొన్న తరువాత మరునాడే అజిత్‌ను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతకు ముందు థాకరే మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కొద్దిసేపు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News