Thursday, May 9, 2024

పాత బూటక హామీలే ఇప్పటి “మోడీ గ్యారంటీలు” : ఉద్ధవ్ థాక్రే

- Advertisement -
- Advertisement -

పాలకవర్గం బీజేపీ గత ఎన్నికల నాటి బూటకపు హామీలే ఇప్పుడు ఎన్నికల ముందు “మోడీ గ్యారంటీలు” గా ప్రజలకు చూపిస్తోందని శివసేన (యుబిటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే సోమవారం ధ్వజమెత్తారు. నవీముంబైకి ఆనుకుని ఉన్న పాన్వెల్ బహిరంగ సభలో ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. మావల్ లోక్‌సభ ప్రస్తుత ఎమ్‌పిని శ్రీరంగ్ బర్నేను స్థానిక ఓటర్లు ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. మావల్ లోక్‌సభ నియోజక వర్గంలో పావెల్ ఒక భాగం.

ఈ స్థానం నుంచి బర్నే 2019లో అవిభక్త శివసేన అభ్యర్థిగా గెలుపొంది, తరువాత షిండే నేతృత్వం లోని శివసేన వర్గంలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతలు అనేక బూటకపు హామీలు గుప్పించారని, ఇప్పుడు అవే బూటకపు ( జుమ్లా) హామీలు మోడీ గ్యారంటీలుగా తిరిగి ప్యాకేజీ చేశారని విమర్శించారు. పిఎం కేర్స్ ఫండ్ కింద కరోనా మహమ్మారి సమయంలో సేకరించిన నిధులను దేనికి ఖర్చు చేశారో స్పష్టం చేయడం లేదని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News