Monday, April 29, 2024

‘ఫ్లయ్‌బీ ఎయిర్‌లైన్’ దివాలా!

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లాండుకు చెందిన ప్రాంతీయ ఎయిర్‌లైన్ ఫ్లయ్‌బీ మూడేళ్లలో శనివారం రెండోసారి దివాలాతీసింది. సిబ్బంది ఉద్యోగాలు పోయాయి, ప్రయాణికులు ప్రయాణం చేయలేక ఇరుక్కుపోయారు(స్ట్రాండెడ్). ఈ ఎయిర్‌లైన్ 2020 మార్చిలోనే దివాలాతీసింది. కరోనా వైరస్ ఆంక్షల కారణంగా పర్యటన రంగం బాగా దెబ్బతినడంతో నాడు 2400 ఉద్యోగాలు పోయాయి. అయితే ఆ ఎయిర్‌లైన్ తిరిగి 2022 ఏప్రిల్‌లో రీలాంచ్ అయింది. బెల్‌ఫాస్ట్, బర్మింగ్‌హామ్, లండన్ హీథ్రో…అవే రూట్లలో తిరిగి నడిచింది.

దివాలా తీసినట్లు ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. ఫ్లయ్‌బీ విమానాలు రద్దయినందున ప్రయాణికులు విమానాశ్రయాలకు రావొద్దని హెచ్చరించింది. స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్‌కు నడిచే తమ సంస్థ అంతర్జాతీయ విమానాలను కూడా రద్దు చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News