Friday, September 20, 2024

భీకర దాడులు

- Advertisement -
- Advertisement -

కీవ్/మాస్కో :ఉక్రెయిన్‌పై రష్యా తమ దాడులను తీవ్రతరం చేసింది. సోమవారం తెల్లవారుతూనే రష్యా సేనలు ఉక్రెయిన్ భూభాగంపైకి 100 వ ర కూ క్షిపణులు , వందవరకూ అటాక్ డ్రోన్లతో వి రుచుకుపడింది. దీనితో దేశంలోని పలు చోట్ల వ రుసగా పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఐ దుగురు చనిపోయారు. పలు ఇంధన కేంద్రాలు, విద్యుత్ కేంద్రాలు కూడా ఈ దాడుల క్రమంలో దేశవ్యాప్తంగా దెబ్బతిన్నాయి. ఇటీవలి కాలంలో రష్యా భూభాగంపై దాడులకు దిగుతున్న ఉక్రెయిన్‌కుతాజా ఎదురుదాడి షాక్ ఇచ్చింది. పలు ప్రాం తాలలో విద్యుత్, నీటి సరఫరాలకు అంతరాయా లు ఏర్పడ్డాయి. దీనితో జనం అలమటించాల్సి వస్తోంది. రష్యా జరిపిన దాడితో దేశ ప్రజలు జీవన్మరణ సంకట స్థితికి చేరుతున్నారని అధ్యక్షులు జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. దారితెన్నూ తెలియని స్థితితో తల్లడిల్లుతున్నామని , ఇక ప్రపంచ దేశాలు ఆదుకోవల్సి ఉందని విజ్ఞప్తి చేశారు.

ఇప్పట్లో ఈ ప్రాంతంలో శాంతి సామరస్య స్థాపన ఎండమావి అవుతున్నదనే విషయం ఈ దాడులతో స్పష్టం అయింది. కీవ్‌లోని పలు ప్రాంతాలలో కరెంటు కట్ అయింది. జనం మంచినీటి సౌకర్యం లేకపోవడంతో విలవిలాడుతున్నారని అధికారులు తెలిపారు. ఓ వైపు ఎప్పుడు దాడులు జరుగుతాయో తెలియని స్థితి, మరో వైపు నిత్యావసరాల కోసం వెంపర్లాటలతో సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరం అయింది. ఇప్పుడు జరిగిన దాడి రష్యా భీకర రూపానికి ప్రతీక అయింది. ప్రత్యేకించి విద్యుత్, ఇతర కీలక మౌలిక వ్యవస్థలను దెబ్బతీస్తూ , ఉక్రెయిన్‌లోని కనీసం పది ప్రాంతాలలో దాడులకు దిగారు. గడిచిన మార్చిలో ఉక్రెయిన్‌లోని పలు పవర్‌గ్రిడ్‌లను ఎంచుకుని రష్యా నాటకీయ, వ్యూహాత్మక దాడులను సాగిస్తోంది. ఉక్రెయిన్‌ను ఆర్థికంగా దెబ్బతీయడం, ప్రధాన నిర్మాణ వ్యవస్థకు గండికొట్టడం లక్షంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే తరచూ అధునాతన యుద్ధ వ్యవస్థతో విరుచుకుపడుతోంది. ఈ దశలో ఇప్పుడు జరిగిన దాడి అత్యంత భీకరమైందని విశ్లేషకులు తెలిపారు. క్షిపణుల వర్షం, వీటితో పాటు డ్రోన్లు కూడా విరుచుకుపడటంతో నివాసిత ప్రాంతాల్లో భయానక పరిస్థితి ఏర్పడింది.

తాము సరిహద్దులు దాటి దూసుకువెళ్లుతున్నామని, తమదే విజయం అని రష్యా ఉక్రెయిన్‌లు పరస్పరం పోటాపోటీగా చెపుతున్నాయి. ఈ తరుణంలోనే ఉక్రెయిన్‌లోని ప్రధాన స్థావరాలను దెబ్బతీయడమే తన పనిగా పెట్టుకుని రష్యా విజృంభించింది. తాము అత్యంత శక్తివంతమైన ఛేదక ఆయుధాలను వాడిన విషయాన్ని రష్యా సోమవారం నిర్థారించింది. ఉక్రెయిన్‌కు వ్యూహాత్మకంగా ఉన్న ఓ సైనిక పారిశ్రామిక సముదాయాన్ని దెబ్బతీశామని కూడా తెలిపారు. రష్యా దాడులలో చనిపోయిన వారిలో నిప్రోపెటోవిస్క్ ప్రాంతానికి చెందిన 69 ఏండ్ల పౌరుడు కూడా ఉన్నాడు. కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటి దాడులకు రష్యా ఎక్కువగా తమ 11 టియు 95 స్ట్రాటజిక్ బాంబర్లను వాడుకుంది. ఇతర ఆయుధాలను కూడా ప్రయోగించింది. అత్యంత కీలక యుద్ధ స్థావరాలను దెబ్బతీసే క్రమంలో పౌరసముదాయ ప్రాంతాలు దెబ్బతింటే తాము చేసేది ఏమీ లేదని రష్యా వర్గాలు ప్రకటిచాయి. ప్రస్తుత భీకర దాడులతో రష్యా అధినేత పుతిన్ ఇక రాజీలేని పోరు వ్యూహంతోనే వెళ్లుతున్నారనేది స్పష్టం అవుతోందని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి.

పౌర వ్యవస్థపై కీలక దాడులు న్యాయమా
రష్యా వైఖరిని తీవ్రంగా ఖండించిన జెలెన్‌స్కీ
ఇటువంటి దారుణాలు , ప్రత్యేకించి జన సామాన్యపు అత్యంత కీలకమైన సరఫరా వ్యవస్థలను రష్యా దెబ్బతీసిందని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ మండిపడ్డారు. ఇంతకు ముందటిలాగానే ఇప్పుడు కూడా రష్యా తన కరకు దాడులతో జనాలను భీతిల్లపర్చడం దారుణం అన్నారు. కరెంటు , నీరు , ఆసుపత్రుల వ్యవస్థలను దెబ్బతీసే పద్థతి ఏ రణనీతి అవుతుందని ప్రశ్నించారు. వందకు పైగా మిస్సైల్స్, డ్రోన్లతో జనవాసాలపై విరుచుకుపడితే జనం ఎటు పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి విద్యుత్ వ్యవస్థ విచ్ఛిన్నం అయిందన్నారు. ఖర్కివ్ నుంచి కీవ్ వరకూ ఒడెస్సా నుంచి పశ్చిమ ప్రాంతాల వరకూ పలు చోట్ల పేలుళ్లు జరిగాయి. కరెంట్ లేకుండా పోయిందన్నారు. రషా ఇప్పుడు ఉత్తరకొరియా నుంచి ఆయుదాలు ప్రయోగిస్తోంది. ఇక యుద్ధం ఆగాల్సి ఉంది.

అమెరికా , ఐరోపా దేశాలు పలు మిత్రపక్షాలు ఉక్రెయిన్ వైమానిక వ్యవస్థతో కలిసి పనిచేస్తే కొంతలో కొంతైనా రష్యా దాడిని ప్రతిఘటించగలం ,పశ్చిమాసియాలో ఇరాన్ ఇతర శక్తులను ఐరోపా దేశాలు ఐకమత్యంతో ఎదుర్కొన్నాయి. మరి ఇక్కడ ఎందుకు ఇక నేరుగా ఈ విషయం క్షేత్రస్థాయిలో ప్రకటితం కావడం లేదని ప్రశ్నించారు. ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన ఇరాన్ క్షిపణులను అమెరికా కూల్చివేసిందని , ఇక్కడ కూడా ఇది జరగాల్సిందే అని పరోక్షంగా తెలిపారు. ప్రధాని డెన్యిస్ షామ్యల్ కథనం ప్రకారం 15 ప్రాంతాలలో విధ్వంసం జరిగింది. ఇక రష్యాపైకి లాంగ్ రేంజ్ దాడులకు అనుమతి ఇవ్వాలని కీవ్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యుద్దం ఆరంభ దశలో ఉక్రెయిన్ వద్ద లాంగ్‌రేంజ్ ఆయుధాలు లేవు. అయితే తరువాతి క్రమంలో వీటిని సిద్ధం చేసుకున్నారు. అటాక్ డ్రోన్లు సంతరించుకున్నారు. వీటి సాయంతో ఇక ఎప్పుడైనా రష్యా లోతట్టు ప్రాంతాల్లో దాడులకు రంగం సిద్ధం అవుతోంది.

రష్యాచమురు , సైనిక స్థావరాలపై ఉక్రెయిన్ దాడులు?
రష్యాలోని అత్యంత కీలకమైన ఆయిల్ రిఫైనరీలు మొదలుకుని పలు సైనిక , వైమానిక స్థావరాలను ఎంచుకుని దాడులు చేపట్టాల్సిందే అని జెలెన్‌స్కీకి ఉన్నతాధికారులు సూచించినట్లు తెలిసింది. వారు ఎంచుకున్న పద్థతిలోనే ఎదురుదాడులకు దిగాల్సిందే అని స్పష్టం చేశారు. లాంగ్ రేంజ్ అటాక్ డ్రోన్లతో మెపుపు దాడులకు దిగితే లక్షం నెరవేరుతుందని తెలిపారు. తాము డ్రోన్ మిస్సైల్స్‌ను సిద్ధం చేసుకున్నామని ఇటీవలే జెలెన్‌స్కీ ప్రకటించారు. రష్యాను దెబ్బతీసేందుకు వీటిని వాడుకోనున్నారు. ఉక్రెయిన్ ఆయుధ అమ్ముల పొదిలో ఇవి శక్తివంతం, ఇతర ఆయుధాల కన్నా వేగవంత లక్షణాలతో ఉన్నాయి. వీటిని రష్యా భూభాగంపైకి ఉక్రెయిన్ ప్రయోగించడం జరిగితే ఈ ప్రాంతంలో పరస్పర దాడులు మరింత పెరిగి, పరిస్థితి దిగజారుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక రష్యా దాడుల నేపథ్యంలో పోలండ్ అప్రమత్తం అయింది. తమ దేశ సరిహద్దుల్లో రష్యా డ్రోన్ల దాడుల క్రమంలో తాము యుద్ధవిమానాలతో సిద్ధంగా ఉన్నామని పోలండ్ సైనిక వర్గాలు ప్రకటించాయి.

దూసుకొచ్చిన డ్రోన్‌తో భగ్గుమన్న మంటలు
రష్యా నగరం సారాటోవ్‌పై ఉక్రెయిన్ హిట్
రష్యాలోని సారాటోవ్ నగరంలో ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో 38 అంతస్తుల వోల్గా స్కై బహుళ అంతస్తుల భవనం దెబ్బతిని , మంటల్లో చిక్కింది. ఉక్రెయిన్ డ్రోన్ ఒకటి ఈ హైటెక్ అపార్ట్‌మెంట్ మధ్య భాగంలోకి దూసుకువెళ్లుతున్న దృశ్యాలు వెలువడ్డాయి. రష్యాలోని సారాటోవ్ తో పాటు ఎంగెల్స్ నగరంపై కూడా ఉక్రెయిన్ దాడులు ఉధృతం చేసింది. భీకర శబ్ధాలు, జనం హాహాకారాలు , తగులబడిపోతున్న అంతస్తులతో సారాటోవ్‌లో భయానక స్థితి ఏర్పడింది. కాగా మరో వైపు ఉక్రెయిన్ డ్రోన్లను రష్యా సేనలు అటకాయించి దెబ్బతీసిన క్రమంలో శకలాలు కిందపడటం వంటి దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మాస్కోకు వాయవ్యంగా పలు వందల కిలోమీటర్ల దూరంలోని నగరాలను ఎంచుకుని ఉక్రెయిన్ దాడులకు దిగింది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో పాక్షికంగా దెబ్బతిన్న అపార్ట్‌మెంట్ పరిస్థితిని తెలిపే వీడియోను రష్యా న్యూస్ ఛానల్ షాట్ వెలువరించింది. మూడు అంతస్తులు దెబ్బతినడం, ముందు భాగంలో కొంత మేరకు ధ్వంసం కావడం వంటి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కాగా రష్యాలోఅత్యంత కీలకమైన బాంబర్ల సైనిక స్థావరాలు ఉండే ఎంగెల్స్‌ను గురిచూసుకుని ఉక్రెయిన్ తరచూ దాడులకు దిగుతోంది. పౌర కేంద్రాలపై ఇప్పటి డ్రోన్ల దాడులను ఉక్రెయిన్ నిర్థారించలేదు. ఖండించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News