Thursday, March 28, 2024

యునియన్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌ను విడుదల చేసిన యునియన్‌ ఏఎంసీ

- Advertisement -
- Advertisement -

ముంబై: యునియన్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌ విడుదల చేస్తున్నట్లు యునియన్‌ ఏఎంసీ వెల్లడించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకం. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ వ్యాప్తంగా క్రమశిక్షణతో ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా క్యాపిటల్‌ వృద్ధిచేయడం లక్ష్యంగా చేసుకుంది. మిడ్‌ మరియు స్మాల్‌ క్యాప్స్‌ అందించే అత్యధిక వృద్ధి సామర్ధ్యంతో ఈ స్కీమ్‌ ప్రయోజనం పొందుతుంది మరియు భారీ క్యాప్స్‌వ్యాప్తంగా అతి తక్కువ అనిశ్చితిని ప్రదర్శిస్తుంది.

యునియన్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌ ప్రధానంగా టాప్‌–డౌన్‌, బాటమ్‌ –అప్‌ విధానం అనుసరించడంతో పాటుగా భారీ,మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో అవకాశాలను అన్వేషిస్తుంది. ఈ స్కీమ్‌ను నిఫ్టీ 500 మల్టీక్యాప్‌ 50ః25ః25 ట్రైకు బెంచ్‌మార్క్‌ చేశారు. ఫెయిర్‌ వాల్యూ విధానం ఆధారంగా స్టాక్‌ ఎంపిక చేశారు.

యునియన్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌ గురించి యునియన్‌ ఏఎంసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) శ్రీ జి. ప్రదీప్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘వేర్వేరు మార్కెట్‌ క్యాప్‌లు వేర్వేరు కాలాల్లో విభిన్నంగా పనిచేస్తాయని డాటా సూచిస్తోంది. అదే సమయంలో ఏ విభాగం చక్కగా పనిచేస్తుంది. ఏది తక్కువగా పనిచేస్తుందనేది అంచనా వేయడం కష్టం. యునియన్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌, మదుపరులను మార్కెట్‌ క్యాప్‌ల వ్యాప్తంగా నేవిగేట్‌ చేయడానికి, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానాన్ని అనుసరించడం ద్వారా అసలైన వైవిధ్యతను చాటడానికి ప్రయత్నిస్తోంది’’ అని అన్నారు.

యునియన్‌ ఏఎంసీ, ఫండ్‌ మేనేజర్‌, ఈక్విటీ సంజయ్‌ బెంబాల్కర్‌ మాట్లాడుతూ ‘‘యునియన్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌ పెట్టుబడిదారులకు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ అంతటా పాలుపంచుకోవడం ద్వారా భారతదేశపు వృద్ధి కథలో పాల్గొనడానికి క్రమశిక్షణతో కూడిన మార్గాన్ని అందిస్తుంది’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News