Sunday, April 28, 2024

దేశంలో సామాజిక న్యాయం బిజెపితోనే సాధ్యం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో సామాజిక న్యాయం బిజెపితోనే సాధ్యమని, తెలంగాణలో విజయం సాధిస్తే బిసి ముఖ్యమంత్రిని చేసిన సుపరిపాలన అందిస్తామని కేంద్రమంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కత్రియా హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ము ఉందా అని నిలదీశారు. రాహుల్‌గాంధీని దేశానికి ప్రధానమంత్రి చేయాలనే ఆలోచన తప్ప తెలంగాణ ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు.

కర్నాటకలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలు అమలు చేయకుండా తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. ఈఎన్నికల్లో అత్యధిక సీట్లు బిసి, ఎస్సీలకు ఇచ్చామని, దేశంలో మొదటిసారిగా బిసిని ప్రధానమంత్రి, ఎస్టీని రాష్ట్రపతి చేసిన ఘనత బిజెపికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలలకోసారి ముఖ్యమంత్రి మారతారని విమర్శించారు.

రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశం ఇవ్వరని, బొగ్గు నుంచి హెలికాప్టర్ల వరకు కాంగ్రెస్ కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని, ప్రజలు బిజెపి ఈసారి అవకాశం ఇస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. సిఎం కెసిఆర్ మెడికల్ కళాశాలల కోసం వంద ఉత్తరాలు రాసినట్టు చెబుతున్న మాట వాస్తవం కాదని తెలంగాణ అభివృద్దికి తాము కృషి చేస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News