Friday, April 26, 2024

ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేసిన ‘భరోస్’

- Advertisement -
- Advertisement -
స్వదేశీ స్మార్ట్‌ఫోన్ ఓఎస్ ఆవిష్కరణ!
‘భరోస్’ డిఫాల్ట్ యాప్‌లు లేకుండా వస్తుంది. అంటే తెలియని లేదా విశ్వసించలేని యాప్‌లను ఉపయోగించమని బలవంత పెట్టదు.

చెన్నై: ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేసిన మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ‘భరోస్’ (BharOS)ను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్ విజయవంతంగా పరీక్షించారు. ‘దేశంలోని పేద ప్రజలు బలమైన, స్వదేశీ, ఆధారపడదగిన, స్వీయఆధారిత డిజిటల్ మౌలిక సదుపాయాన్ని ఉపయోగించుకోగలరు’అని ప్రధాన్ ఈ సందర్భంగా అన్నారు.
భరోస్‌ను జాండ్‌కె ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(జాండ్‌కాప్స్) అభివృద్ధి చేసింది, దీనిని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి) మద్రాస్‌లో ఇంక్యుబేట్ చేశారు.

కమర్షియల్ ఆఫ్ దిషెల్ఫ్ హ్యాండ్‌సెట్‌లలో ఈ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం భరోస్ సేవలనను గోప్యత, భద్రత అవసరాలున్న సంస్థలకు మాత్రమే అందిస్తున్నారు. అలాంటి యూజర్లు ప్రైవేట్ 5జి నెట్‌వర్క్ ద్వారా ప్రైవేట్ క్లౌడ్ సర్వీసెస్‌ను యాక్సెస్ చేసేవారై ఉండాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News