- Advertisement -
ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్‌లో దారుణం జరిగింది. ఐదేళ్లపై బాలుడిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసి చంపేసి ముళ్లపొదల్లో పడేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కుటుంబం తన పిల్లలతో కలిసి రామంతపూర్‌లో నివసిస్తోంది. ఈ నెల 12న దంపతుల ఐదేళ్ల కుమారుడు కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సిసి ఫుటేజీని పరిశీలించగా కమర్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే చేశానని నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బీహార్ చెందిన వ్యక్తిగా గుర్తించారు.
- Advertisement -