- Advertisement -
ప్రపంచంలోనే హైదరాబాదీ బిర్యానీ చాలా ఫేమస్. పలువురు సినీ ప్రముఖులు హైదరాబాదీ బిర్యానీ రుచికి మైమరచిపోయారు. తాజాగా సోషల్ మీడియా క్వీన్ ఉర్పీ జావెద్.. ముంబయ్, హైదరాబాదీ బిర్యానీ మధ్య వ్యత్యాసం చెప్పే ప్రయత్నం చేసింది. “ముంబయ్ బిర్యానీ అన్నది పులావ్‌లా ఉంటుంది. అందులో ఆయిల్ తప్ప ఇంకేమీ ఉండదు. కానీ హైదరాబాదీ బిర్యానీ రుచే వేరుగా ఉంటుంది. ఈ బిర్యానీ రుచికి సాటి లేదు. అయితే సీ పుడ్స్ మాత్రం హైదరాబాద్ కంటే ముంబయ్‌లోనే బాగుంటాయి” అని చెప్పింది. ఇటీవలే హైదరాబాద్ విచ్చేసిన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా హైదరాబాదీ బిర్యానీ గురించి మాట్లాడాడు. హైదరాబాదీ బిర్యానీ రుచి ఇంకెక్కడా ఉండదని అన్నాడు.
- Advertisement -