Tuesday, April 30, 2024

షాదాబ్ లో బిర్యానీ.. మొజంజాహీలో ఐస్ క్రీం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి మంత్రి కెటిఆర్ సందడి
 సెల్ఫీలు, కరచాలనం కోసం ఎగబడ్డ జనం

మనతెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ శుక్రవారం రాత్రి పాతబస్తీలో సందడి చేశారు. చార్మినార్ సమీపంలోని ఫేమస్ షాదాబ్ రెస్టారెంట్‌కు వెళ్లి.. అక్కడ ప్రజలతో కలిసి బిర్యానీ తిన్నారు. అనంతరం మొజంజాహీ మార్కెట్‌లో ఫేమస్ ఐస్‌క్రీమ్‌ను రుచి చూశారు.
ఎలాంటి ప్రోటోకాల్ లేకుండానే వెళ్లిన మంత్రి
పాతబస్తీ మదీనా చౌరస్తా దగ్గర శాదాబ్ రెస్టారెంట్‌లో మంత్రి కెటిఆర్ కనిపించడంతో.. అక్కడకు వచ్చినవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎలాంటి హడావుడి లేకుండా, ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా కెటిఆర్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లేంత వరకు సాదాసీదాగా వచ్చిన ఆయనను మెదట ఎవరూ గుర్తుపట్టలేదు. కానీ ఆర్డర్ ఇచ్చే సమయంలో అక్కడ ఉన్నవారు మంత్రిని చూసి ఆశ్చర్యపోయారు. ఎవరైనా మంత్రి వస్తే… మినిస్టర్ వస్తున్నారంటూ కాన్వాయ్‌తోపాటు.. పోలీసుల హడావుడి ఉంటుంది..కానీ ఇలా సాధారణ పౌరుడిలా వచ్చి బిర్యానీ ఆర్డర్ ఇవ్వడం చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
పలురకాల వంటకాలను రుచిచూసిన కెటిఆర్
కెటిఆర్ బిర్యానీతోపాటు పలురకాల హైదరాబాదీ వంటకాలను రుచిచూశారు. మంత్రి వచ్చారని తెలుసుకుని రెస్టారెంట్ యాజమాన్యం ఆయనకు స్పెషల్ డిషెస్‌ను వడ్డించారు. మంత్రి కెటిఆర్‌ను చూసిన పలువురు ఆయనను తమ టేబుల్ మీదికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడ ఉన్న రెండు కుటుంబాలతో మాట్లాడారు. కెటిఆర్‌తో మాట్లాడిన మైనార్టీ కుటుంబం హైదరాబాద్ నగరంలో ఉన్న అద్భుతమైన శాంతియుత వాతావరణాన్ని గంగాజమున తేహజీబ్‌ను ప్రత్యేకంగా గుర్తు చేశారు. మహారాష్ట్ర నుంచి పర్యటనకు వచ్చిన మరో మైనార్టీ కుటుంబం మంత్రి కెటిఆర్‌ను ప్రత్యేకంగా పలకరించారు. తమకు హైదరాబాద్ నగరం ఎంతగానో నచ్చిందని ఒకవైపు సాంప్రదాయ బద్ధమైన ప్రత్యేకతను కొనసాగిస్తూనే మరోవైపు ఆధునికతను సంతరించుకున్నని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఒక ఇల్లు కొనుక్కొని ఇక్కడే స్థిరపడాలన్న ఆలోచన తమకు ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలైందని తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా వారి పాపతో మంత్రి కాసేపు మాట్లాడారు. హైదరాబాద్ పట్ల ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత మరో టేబుల్ పైన ఉన్న హైదరాబాది యువతీ యువకులతో, పలువురు నడివయస్కులతో మంత్రి కెటిఆర్ ముచ్చటించారు.
హోటల్‌లో పలువురిని పలకరించి, ముచ్చటించిన మంత్రి
రాత్రి 11 గంటల సమయంలో మంత్రి కెటిఆర్ తమతో పాటు సాధారణ వ్యక్తిలా హోటల్లో ప్రత్యక్షం అవడంతో వారంతా ఆశ్చర్యం, సంతోషం వ్యక్తం చేశారు. వారంతా మంత్రి కెటిఆర్‌తో ముచ్చటించారు. ముఖ్యంగా హైదరాబాద్ దగ్గర ప్రగతి, ప్రస్తుత ఎన్నికల సందర్భంగా ఉన్న పరిస్థితులపైన తమ అభిప్రాయాలను మంత్రితో పంచుకున్నారు. కచ్చితంగా హైదరాబాద్ నగర ప్రగతి ముందుకు ఇదే విధంగా కొనసాగాలంటే బిఆర్‌ఎస్ ప్రభుత్వమే కొనసాగాలన్న బలమైన ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు. కచ్చితంగా మీ నాయకత్వానికి ఓటు వేస్తామని అక్కడున్న వారు కెటిఆర్‌కు హామీ ఇచ్చారు. హోటల్ షాదాబ్ నుంచి బయలుదేరిన మంత్రి కెటిఆర్ ముజం జాహి మార్కెట్ వద్ద ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న పలువురుతో మాట్లాడి, సితాఫల్, చీకు ఐస్ క్రీం రుచి చూశారు.అటు హోటల్, ఫేమస్ ఐస్ క్రీం వద్ద పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. మంత్రితో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు.

KTR 2

KTR 3

KTR 4

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News