న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆర్‌బిఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేను ప్రభుత్వం నియమించింది. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కె.వి.సుబ్రమణ్యన్ స్థానంలో ఉర్జిత్ నియమితులవగా, ఆరు నెలల సమయం (మూడేళ్ల కాలం) ముందుగానే ప్రభుత్వం ఆయను తొలగించి ఈ నిర్ణయం తీసుకుంది. 2016 నుంచి 2018 వరకు ఆర్‌బిఐ 24వ గవర్నర్‌గా పనిచేసిన పటేల్, భారతదేశ ద్రవ్యోల్బణ లక్ష్య విధాన రూపశిల్పిగా గుర్తింపు పొందారు. ఈ నూతన బాధ్యతల్లో భాగంగా, పటేల్ ఐఎంఎఫ్ బోర్డులో భారతదేశం, ఇతర అనుబంధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. సభ్య దేశాల ఆర్థిక విధానాలను సమీక్షించడం, ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై చర్చించడం, దేశాలకు ఆర్థిక సహాయాన్ని ఆమోదించడం వంటి కీలక కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తారు. పటేల్‌కు గతంలోనూ ఐఎంఎఫ్‌లో పనిచేసిన అనుభవం ఉంది. 190 దేశాల సభ్యత్వంతో వాషింగ్టన్ డి.సి. కేంద్రంగా పనిచేసే ఐఎంఎఫ్, ప్రపంచ ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉర్జిత్ పటేల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -