Monday, April 29, 2024

ఉర్జిత్ రాజీనామా వెనుక మోడీ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

24krk1

నిరర్థక రుణాలపై కఠిన వైఖరి
ఎలక్టోరల్ బాండ్స్ జారీకి వ్యతిరేకత
ఆచరణ సాధ్యవ కాని సలహాలు ఇచ్చిన ఆర్‌బిఐ గవర్నర్
స్వతంత్రంగా వ్యవహరించే ఉర్జిత్ ధోరణి నచ్చని ప్రధాని
‘వుయ్ ఆల్సో మేక్ పాలసీ’ పుస్తకంలో వెల్లడించిన ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి గార్గ్
న్యూఢిల్లీ: 2018 జులైలో అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ పటేల్ హటాత్తుగా తన పదవికి రాజీనామా చేయడంతెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఉర్జిత్ పటేల్ అప్పట్లో ప్రకటించారు. అయితే ఆయన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తాను రాసిన ‘వుయ్ ఆల్సో మేక్ పాలసీ’ పుస్తకంలో వెల్లడించారు. ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోడీ, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీల తీవ్ర అసంతృప్తి మరో మాటలో చెప్పాలంటే ఆగ్రహం కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు గార్గ్ తన పుస్తకంలో సవివరంగా వెల్లడించారు. ఉర్జిత్ పటేల్ రాజీనామాకు దారి తీసిన పరిస్థితులు గార్గ్ మాటల్లోనే.. 2018 జులై నాటికి ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోఆర్‌బిఐ పని తీరుపట్ల కేంద్ర ప్రభుత్వం బాగా విసిగిపోయింది. పరిస్థితి ఈ దురదృష్టకరమైన స్థాయికి చేరుకోవడానికి వెనుక పెద్ద కథే నడిచింది. అరుణ్ జైట్లీ లాంటి నెమ్మదస్థుడు సైతం ఆగ్రహం చెందారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. 2018 ఫిబ్రవరి 12న దీనికి బీజం పడింది. బ్యాంకింగ్ రంగానికి చెందిన నిరర్థక రుణాల విషయంలో అత్యతం కఠినమైన విధానంతో ఉర్జిత్ పటేల్ ముందుకు రావడం దీనికి కారణం. రుణాలు చెల్లించని వారిపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన ప్రతిపాదించారు. దీంతో విద్యుత్ ఉత్పాదక కంపెనీలకు బ్యాంకు రుణాలు రావడం పెద్ద సమస్యగా మారింది. ఆర్‌బిఐ చట్టం సెక్షన్ 7 కింద జారీ చేసిన ఆదేశాలను పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశం దరిమిలా విద్యుత్ రంగంపై వచ్చిన ఒత్తిడిని పరిష్కరించడానికి క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సాధికార కమిటీ సమావేశంలో పాల్గొనడానికి కూడా ఆర్‌బిఐ నిరాకరించింది. 2018 మార్చి 14న గాంధీనగర్‌లోని గుజరాత్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ లా అండ్ ఎకనామిక్స్‌లో ఉర్జిత్ పటేల్ ఘాటైన ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో ఆయన జాతీయ బ్యాంకులపై రెగ్యులేటరీ అథారిటీ అయిన ఆర్‌బిఐ చర్యలు తీసుకోనీయకుండా చేస్తున్న ప్రభుత్వ అసమర్థతను తీవ్రంగా తప్పుబట్ట్టారు. ఈ కారణంగా పిఎస్‌బిలపై చర్యలు తీసుకోకుండా ఆర్‌బిఐ చేతులు కట్టేసినట్లయిందని ఆయన అభిప్రాయపడ్డారు. తనను పురాణాల్లోని నీలకంఠుడి( శివుడి)తో పోల్చుకున్న ఉర్జిత్ పటేల్ విషాన్నంతా తాగడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా కూడా ఆయన చెప్పుకున్నారు. ఈ ప్రసంగం, ఉర్జిత్ పటేల్ తనను శివుడితో పోల్చుకోవడం ఓ విధంగా ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారేలా చేసింది. 2018 మార్చి , ఏప్రిల్ నెలల్లో ఉర్జిత్ పటేల్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తూనే వచ్చారు. ఈ పథకాలను రూపకల్పన చేసేందుకు , బ్యాంకింగ్ విధానం ద్వారా వీటిని జారీ చేయడానికి మొదట్లో అంగీకరించినప్పటికీ బాగా ఆలోచించిన తర్వాత ఈ బాండ్లను ఆర్‌బిఐ ద్వారా అది కూడా డిజిటల్ రూపంలో మాత్రమే జారీ చేయాలని ఆయన పట్టుబడుతూ వచ్చారు. దీంతో దాతల ఎవరో పూర్తిగా గుర్తించచగలిగే అవకాశం ఉండడంతో ఈ పథకం ఆదిలోనే బెడిసికొట్టింది. అప్పటికే దేశంలో వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆర్‌బిఐ 2018 జూన్‌లో రెపో రేటును 6.5 శాతానికి పెంచింది. ఫలితంగా కనీస మద్దతు ధరలను పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఏర్పడింది. ఆగస్టులో మరోసారి ఆయన రెపో రేటును మరో పావు వాతం పెంచారు. బ్యాంకులు లిక్విడిటీ మార్గం ద్వారా వరసగా ఆర్‌బిఐ నుంచి అప్పు తీసుకోవలసి రావడంతో ఆర్‌బిఐలో లిక్విడిటీ పరిస్థితి కూడా చాలా క్లిష్టంగానే మారింది. బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయల మేర అదనపు మూలధనాన్ని అందించాల్సిన కారణంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఈ అన్ని అంశాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆందోళనకు గురి చేశాయి. ద్రవ్య లబ్ధత పరిస్థితిని కాస్త సడలించాలని, విదేశీ ద్రవ్య నిధులను పెంచడానికి చర్యలు తీసుకోవాలని, నిరర్థక రుణాల సంక్షోభాన్ని పరిష్కరించడానికి, మరింత ఆచరణాత్మక విధానాన్ని అనుసరించాలని, సంక్షోభంలో ఉన్న బ్యాంకుల విషయంలో అనుసరించడానికి ఉద్దేశించిన పిసిఎ నిబంధనావళికి విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించే విధానం ఉండాలని ప్రభుత్వం అభిప్రాయపడుతూ ఉండింది.

ఈ విషయాలన్నిటినీ ఆర్‌బిఐతో చర్చించాలని ప్రభుత్వం ఎంతగా కోరుకుంటూ వచ్చినా ఉర్జిత్ పటేల్ అంతగా వారికి అందుబాటులో లేకుండా పోతూ వచ్చారు. సాధారణంగా సహన శీలి, సర్దుకు పోయే మనస్తత్వం కలిగిన అరుణ్ జైట్లీకి సైతం ఆర్‌బిఐ ముఖ్యంగా ఉర్జిత్ పటేల్ ప్రవర్తిస్తున్న తీరు నచ్చలేదు. తాను ఎంతో గౌరవంగా చూసే ఉర్జిత్ పటేల్‌నుంచి కనీస మర్యాదను ఆయన ఆశించారు. ఆర్‌బిఐ అర్థవంతంగా వ్యవహరిస్తుందని, ప్రజా ప్రయోజనాల విషయంలోఅవసరమైన కనీస చర్యలు తీసుకుంటుందని, ఆర్థిక వ్యవస్థ సాగిపోయేలా చూస్తుందని ఆయన ఆశించారు. అయితే ఉర్జిత్ పటేల్ మాత్రం ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకునేందుకు తాను సిద్ధంగా లేననే విధంగా ప్రవర్తించారు. తాను అత్యంత స్వతంత్రంగా వ్యవహరించిన ఆర్‌బిఐ గవర్నర్‌గా చరిత్ర పుటల్లో నిలిచిపోవాలని ఉర్జిత్ పటేల్ భావిస్తున్నారనే భావన బలపడుతూ వచ్చింది. అరుణ్ జైట్ల్లీ కూడా అదే భావనకు వచ్చారు.ఈ అసాధారణ పరిస్థితిలో ప్రభుత్వానికి ఆర్‌బిఐ చట్టంలోని సెక్షన్ 7ను ప్రయోగించక తప్ప తనకు వేరే మార్గం లేదని ప్రభుత్వం భావించింది. ప్రజా ప్రయోజనాలు, ఆర్థిక అవసరాల దృష్టా అవసరమని ప్రభుత్వం భావించిన దానిని చేయాలని ఆర్‌బిఐని ఆదేశించవచ్చని ఈ సెక్షన్ చెబుతోంది.
కీలక సమావేశం
ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితిని సమీక్షించడానికి, ఆర్‌బిఐ ఏం చేయాలో సూచించడం కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని నిర్ణయించారు.2018 సెప్టెంబర్ 14న ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉర్జిత్ పటేల్, ఆర్‌డిఐ డిప్యూటీ గవర్నర్లు విరల్ ఆచార్య, ఎన్ విశ్వనాథన్ హాజరయ్యారు. ప్రభుత్వం వైపునుంచి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, డిజిటల్ ఫైనాన్స్ సర్వీసెస్( డిఎఫ్‌ఎస్) సెక్రటరీ రాజీవ్ కుమార్, నేను(గార్గ్) హాజరయ్యాం. సమావేశంలో ఉర్జిత్ పటేల్ ఆర్థిక పరిస్థితిపై ఒక ప్రజంటేషన్ ఇచ్చారు. ఆర్థిక పరిస్థితి వాస్తవానికి కనిపిస్తున్న దానికన్నా చాలా ఆందోళనకరంగా , భయానకంగా ఉందని ఆయన ఆ ప్రజంటేషన్‌లో తేల్చి చెప్పారు.ఆయన కొన్ని సిఫార్సులు కూడా చేశారు. ఆయన చేసిన సిఫార్సులన్నీ కూడా ప్రభుత్వం చేయల్సినవే తప్ప ఆర్‌బిఐ చేయాల్సింది ఏమీ లేకపోవడం గమనార్హం. ఆయన నాలుగు ప్రధాన పరిష్కారాలు సూచించారు.

201819బడెట్‌లో విధించిన లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్(ఎల్‌టిసిజి) పన్నును రద్దు చేయాలని ఆయన సూచించారు. స్థూల ఆర్థిక వ్యవస్థ తిరిగి చక్కబడడం కోసం ద్రవ్య లోటును గణనీయంగా తగ్గించడానికి అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. దీనికోసం పెట్టుబడుల ఉపసంహరణ లక్షాలను గణనీయంగా పెంచాలని ఆయన ప్రభుతత్వానికి సూచించారు. భారత ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టేలా ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్(ఎఐఐబి), న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఎన్‌డిబి) లాంటి కొత్త బహుళజాతి సంస్థలను ఒప్పించడానికి ప్రయత్నించాలనేది ఆయన చేసిన మరో ప్రతిపాదన. చివరగా ఎంఎస్‌ఎంఇలు సహా పలు కంపెనీలకు చెల్లించాల్సిన బిల్లులను ప్రభుత్వం చెల్లించాలని కూడా ఆయన ప్రతిపాదించారు. ఆయన అంచనా ప్రకారం ఈ బిల్లులు లక్షల కోట్లలో ఉంటాయి.

జైట్లీ సైతం అసహనం
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శించడం చాలా అరుదు. అలాగే ఉన్నతాధికారులచేసే సూచనలు, సలహాలతో విభేదించడం లేదా వ్యతిరేకించడం కూడా చేయరు.అయితే ఆ రోజు మాత్రం ఆయన తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయారు.ఆయన మధ్యలో జ్యోం చేసుకుని గవర్నర్ ఉర్జిత్ పటేల్ సూచించిన పరిష్కారాలు ఎంతమాత్రం పరిష్కారాలు కానే కావన్నారు. అవి పూర్తిగా ఆచరణ సాధ్యం కానివే కాక కోరుకోదగ్గవి కాదని కాదని కూడా జైట్లీ అన్నారు. ఆర్‌బిఐ తీసుకున్న వైఖరి కారణంగా నిరర్థక రుణాలు ముఖ్యంగా విద్యుత్ రంగం, ఎంఎస్‌ఎంఇలకు సంబంధించిన రుణాలకు సంబంధించి ఎంత క్లిష్టంగా మారాయో రాజీవ్ కుమార్ ప్రధానికి వివరించారు.

ఆర్‌బిఐ ఫిబ్రవరి 12 నాటి సర్కులర్ జారీ చేసినప్పుడు తనను కానీ, డిఎఫ్‌ఎస్‌ను కానీ సంప్రదించడం లేదని ఆయన ఫిర్యాదు చేశారు. వార్తాపత్రికల ద్వారా ఆ విషయం తెలుసుకుని తాను ఎంతగా ఇబ్బందిగా ఉంటుందో కూడా ఆయన వివరించారు. ఆర్‌బిఐ గవర్నర్ చేసిన ప్రజంటేషన్‌ను ద్రవ్య లోటును తగ్గించడం, పెట్టుబడుల లక్షాలను పెంచడం ఎంత కష్టమో నేను వివరించాను. అంతేకాదు ఎఐఐబి, ఎన్‌డిబిలనుంచి పెట్టుబడులను పొందడం చాలా నిదానమైన ప్రక్రియ అని, ఒకటి, రెండేళ్లు పడుతుందని కూడా చెప్పాను. రెండింటికి గవర్నర్ కూడా అంగీకరించారు. మిగతా రెండింటితో ఏకీభవించలేదు. దీంతో ఆర్థిక మంత్రి జైట్ల్లీ హడావుడిగా రాత్రి 9.45 గంటల సమయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి దేశంలో విదేశీ ద్రవ్య నిల్వలు పెరగడానికి ఆర్‌బిఐతో చర్చించి తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు.

ఉర్జిత్‌కు ఘాటుగా ప్రధాని క్లాస్
దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పాటుగా ప్రభుత్వం, ఆర్‌బిఐ మధ్య పెరిగిన అఘాతం కూడా ప్రధాని మనసుపై ప్రభావం చూపించింది. ఎందుకంటే ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్‌ను ఆయన స్వయంగా ఎంపిక చేయడమే కాకుండా అన్ని సందర్భాల్లో ఆయనను గట్ట్టిగా సమర్థిస్తూ వచ్చారు.అయితే ఉర్జిత్ పటేల్ పెద్దగా జనంతో సంబంధాలు పెట్టుకునే వ్యక్తి కాదు.2018జులైనుంచి ఆయన నాతో కూడా సంప్రదించడం మానేశారు. ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న పీయూష్ గోయల్‌తో, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కూడా ఆయన కమ్యూనికేషన్లు తెగిపోయాయి. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఉర్జిత్ పటేల్ మనసు మార్చుకోవడంతో పికె మిశ్రాతో కూడా ఆయన సంబంధాలు కొంత వరకు దెబ్బతిన్నాయి. గత కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలపై ప్రధాని కూడా సంతోషంగా లేరు. బహుశా ఆయన సహనం చచ్చిపోయిందేమో! దాదాపు రెండు గంటల ప్రజంటేషన్, చర్చల తర్వాత కూడా ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఆర్థిక సంవత్సరం మధ్యలో ఎల్‌టిసిజి టాక్స్‌ను ఉపసంహరించాలని సూచించినందుకు ఆయన ఉర్జిత్‌ను విమర్శించారు.

పెద్ద ఎత్తున పెరిగిపోయిన నిధులు దేనికీ ఉపయోగించకుండా అడ్డుపడిన ఉర్జిత్‌ను ఆయన పాముతో పోల్చారు కూడా. ఆర్‌బిఐ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏమీ చేసే స్థితిలో లేదనే అంచనాకు ఆయన వచ్చినట్లు కనిపించింది. ఆ దశలో ప్రధాని సహనం కోల్పోయి ఉర్జిత్ పటేల్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ప్రధానిని అలాంటి మూడ్‌లో నేను చూడడం అదే తొలిసారి.అంతకు ముందు బోర్డు సమావేశంలో అంగీకరించిన కేంద్ర బోర్డు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఉర్జిత్ ఇష్టపడడం లేదనే విషయాన్ని కూడా ప్రధానికి అధికారులు తెలియజేశారు. అందరు డైరెక్టర్లు హాజరైన పక్షంలో ఆగస్టు30లేదా 31న ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఉర్జిత్ అంతకు ముందు అంగీకరించారు. ఆ తర్వాతి వారంలో డైరెక్టరల్లకు ఆర్‌బిఐ లేఖలు కూడా రాసింది. అయితే ఆ తర్వాత ఉర్జిత్‌కు రెండో ఆలోచన వచ్చినట్లుంది. దాంతో ఆయన ఆ సమావేశం ఏర్పాటు చేయలేదు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడంపై ప్రధాని ఉర్జిత్ పటేల్‌పై తీవ్రంగా మండిపడ్డారు. మేము సమావేశంనుంచి బైటికి వస్తున్నప్పుడు నేను ఉర్జిత్‌ను చాలా జాగ్రత్తగా కేంద్ర బోర్డు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారా అని అడిగా. దానికి ఆయన ఏ మాత్రం తడుముకోకుండా ‘ లేదు’ అని సమాధానమిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News