Thursday, May 29, 2025

క్లాసులకు డుమ్మా కొడితే వీసా రద్దు

- Advertisement -
- Advertisement -

చదువు మధ్యలో
ఆపేసినా వేటు తప్పదు
భవిష్యత్‌లో అమెరికా
వీసా పొందే అర్హతను
కోల్పోతారు
అంతర్జాతీయ విద్యార్థులకు
అమెరికా హెచ్చరిక
న్యూఢిల్లీ : వీసా నిబంధనలను ఉ ల్లంఘిస్తే.. బహుష్కరణ తప్పదని అమెరికా ప్రభుత్వం భారతీయ వి ద్యార్థులకూ, అంతర్జాతీయ విద్యార్థులకు మరో సారి ఘాటైన హెచ్చరిక జారీ చేసింది. విద్యార్థులు అం తా ఖచ్చితంగా వీసానిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టంచేసింది. కాలేజీలకు తెలియజేయకుండా చ దువు మానేసినా, తరగతులకు డు మ్మా కొట్టినా, స్టడీ కార్యక్రమాన్ని అర్థాంతరంగా మధ్యలో వదిలి వే సినా వారి వీసా రద్దు చేసే ప్రమా దం ఉందని ప్రభుత్వం స్పష్టం చే సింది. అంతే కాదు. భవిష్యత్ లో నూ ఎప్పుడూ అమెరికా వీసా పొం దే అర్హతను కూడా కోల్పోతారని హెచ్చరించారు. ఇమిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించి, వ్యవహరించిన దాదాపు 4,700 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే రద్దు చేసినట్లు మీడియా తెలిపింది.

అక్రమ వలసదారులు, అంతర్జాతీయ విద్యార్థులపై అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కొరడా ఝుళిపించిన తర్వాత వరుసగా ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. చాలా కేసుల విషయంలో వందలాది మంది విద్యార్థుల వీసాలను, వారికి కానీ, వారు చదువుతున్న కాలేజీలకు కానీ, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వారికి సంబంధించిన స్టూడెంట్స్, ఎక్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నుంచి వారి పేర్లను తొలగించిన ట్లు తెలిసింది. అమెరికా హోమ్ లాండ్ సెక్యూరిటీ సంస్థ, ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ స్టూడెంట్స్, ఎక్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ విధానం ద్వారా అంతర్జాతీయ విద్యార్థులు, ఎక్ఛేంజ్ విజిటర్ల కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉంటాయి. మరో పక్క 2023లో అమెరికా కౌన్సిలర్ల బృందం ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ఎక్కువగా లక్షా 40 వేల స్టూడెంట్ వీసాలను భారతీయులకే జారీచేసింది. ఈ మేరకు వీసాలు జారీ చేయడం వరుసగా మూడో ఏడాది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News