Saturday, July 27, 2024

రైతుల ఆదాయం రెట్టింపు లేదు కానీ నల్లసాగు చట్టాలు తెచ్చారు: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా నల్ల సాగు చట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకరావడంతో కొన్ని నెలలపాటు రైతులు తీవ్రమైన ఆందోళన చేశాక ఆ చట్టాలను రద్దు చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయలేదని, అగ్నివీర్ పథకం దేశ రక్షణకు ప్రమాదకరమని, ఆర్థిక విధానాల్లోనూ మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విరుచుకపడ్డారు.

70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 40 శాతానికి పెరిగిందని, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో పేదలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు… కానీ అన్నదాతల ఇప్పుడు తీవ్రంగా నష్టపోతున్నారని దుయ్యబట్టారు. గతంలో ఏ ప్రధాని కూడా మోడీ అంతలా దిగజారి మాట్లాడలేదని, పదేళ్లలో ఏం చేశారో చెప్పటం లేదని, మళ్లీ గెలిస్తే ఏం చేస్తారో చెప్పటం లేదని ఉత్తమ్ ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వం గత పది ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య బుల్లెట్ రైలు ఉండాలని కేంద్రాన్ని ఎన్నో సార్లు కోరామని, బిజెపి నేతలకు తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత కూడా లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News