Wednesday, December 6, 2023

వార ఫలాలు 01-102023 నుండి 07-10-2023

- Advertisement -
- Advertisement -

మేషం: ఉద్యోగ-వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో ఉన్న మానసిక ఆందోళనలు మీకు తెలియకుండానే చేత్తో తీసినట్లవుతుంది. ఒక విధంగా శత్రువులు మిత్రులుగా మారతారని చెప్పవచ్చు. కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబంలో చిన్నపాటి మాటపట్టింపులు ఉండే అవకాశాలున్నాయి. మీ మీద అక్కస్సు కారణం అవ్వవచ్చు. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సంతానం పట్ల శ్రద్ద అధికమవుతుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి, విద్యార్థినివిద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. క్రీడా, కళారంగాల వారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఈ రాశి వారు ప్రతి నిత్యం ఓంనమః శివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

వృషభం: ఉద్యోగస్తులకు పైవారితో పరస్పర అవగాహన సంభాషణలు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయదారులకు కొత్త పనులు ప్రారంభించుటకు, కొనుగోలు చేయుటకు, (పనిముట్లు)మంచి అనుకూల సమయం. కుటుంబ పరంగా వియోగాలు కానీ, విరోధాలు గాని ఉండే విధంగా గోచరిస్తున్నాయి. సంతానం ఆరోగ్య విషయంలో, సంతాన (మగ,ఆడ పిల్లలతో) విషయవ్యవహారాల పట్ల అభిప్రాయభేదాలుండే అవకాశాలుగోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. ఎలెక్ట్రిక్ ఉద్యోగస్తులకు, టెక్నీకల్ రంగాల వారికి అనుకూలమైన సమయంగా అని చెప్పవచ్చు. ప్రతి నిత్యం గణపతి స్వామి వారికీ జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు.

మిథునం: ఈవారం మిశ్రమ ఫలితములు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంటాబయట మీ మాట చెలామణి అవుతుంది, గౌరవం వృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ మంచి త నంతో, కార్యసాధనతో ముందుకు సాగండి. ఆర్ధిక పరంగా సమయానికి ధనం చేతికి అందకపోవచ్చు, ఋణాలు,లోన్లు విషయంలోఒత్తిడిలుటాయి. కుటుంబం, బంధువులతో సమాగమంతో ఉండే అవకాశాలున్నాయి. సాఫ్ట్ వేర్, ఇతర ఉద్యోగులకు కొంత ఆర్థికాభివృద్ధి ఉంటుంది. శత్రువర్గం నుండి విమర్శలు, ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థినివిద్యార్థులు దృష్టి పెట్టి, పట్టుదలతో చదువుకుంటే ఫలితాలు సాధిస్తారు. నిత్యం స్వామివారికీ జిల్లేడువత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు.

కర్కాటకం : సర్వత్రా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు, ఆర్ధిక లావాదేవీలు, అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సంయమనం ఏర్పడుతుంది. బంధువులతో చిన్నపాటి మనస్పర్థలు వాటిల్లుతాయి. ఆరోగ్యంపట్ల శ్రద్దవహించండి. స్నేహితులు, ఇతరులను నమ్మిరహస్యాలు తెలపడం మంచిది కాదు, వారే శత్రువులయ్యే అవకాశాలున్నాయి. జాగ్రత్త వహించండి. అనుకున్నపనులలో జాప్యం వద్దు, మరింత ఆలస్యం అవుతాయి. విద్యార్థులు కష్టపడి చదవవాల్సిన సమయంగా చెప్పవచ్చు. అర్ధాష్టమ శని నడుస్తున్నందున, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం మంచిదని చెప్పదగిన సూచన. నిత్యం స్వామి వారికీ జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు.

సింహం: ఉద్యోగ పరంగా అంత అనుకూలమైన పరిస్థితులు ఉండకపోవచ్చు, ఎవరినైతే మీరుకార్యాలయాలలో నమ్ముతారో, మీ కంటే తక్కువ స్థాయి ఉద్యోగస్థులైనప్పటికీ వారి వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా ఆర్ధికంగా కొంత నష్టాలు ఉండవచ్చు. మీరు అనుకున్న పనులు కొంత అధిక ఖర్చు, శ్రమతో పూర్తవుతాయి. ద్వితియార్ధంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్ధికంగా అనుకున్న సమయానికి ధనం చేతికి అందడం, అనుకోని విధంగా సమస్యలను పరిష్కరించుకుంటారు.విద్యార్థులకు విద్యాభివృద్ధి, విద్యపై ఆసక్తి పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి సానుకూల ఫలితములున్నాయి. శారీరక ఆరోగ్యం బాగున్నా కొద్దిపాటి టెన్సన్స్ ఉంటాయి. ఈ రాశివారు జిల్లేడువత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

కన్య: ప్రతికూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ మాటలో చంచలత్వం కారణంగా బం ధు మూలకమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు. మీరు ఒకటి మాట్లాడితే వేరొకటి అర్ధం అయ్యి అవి అపార్ధాలకు దారితీయవచ్చు. మాటలో కఠినత్వం లేకుండా ఆచితూచి మాట్లాడండి. అవే మీ వెనుక దుష్ప్రచారం అవుతాయి. అనుకున్న పనులు కోసంఏదైనా దూర ప్రయాణాలుంటె వాయిదా వేయడం మంచిది వృధాప్రయాస అవుతుంది. ఉద్యోగ, వ్యాపారస్తులకు కొంత సానుకూలంగా ఉంటుంది. అనుకున్నపనులలో ఆలస్యం అయినా, అతికష్టంమీద పనులు పూర్తవుతాయి. నూతన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత లోపం, ఇతర విషయాలపైన ఎక్కువ మక్కువ వలన ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రతి నిత్యం ఓం నమో వేంకటేశాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం.

తుల: విందు,విలాసాలకు ప్రాధాన్యత పెరిగే అవకాశాలున్నాయి. ఖర్చు, ఆదాయం విషయంలో జాగ్రత్త వహించండి. మీ సరదాలుమితిమీరి ఇంటిలో గొడవలకు, వివాదాలకు దారి తీయకుండా జాగ్రత్త వహించండి. ఆర్థిక పరంగా పొదుపుకి ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు పైఅధికారుల ఒత్తిడి, శత్రువర్గం నుండి సమస్యలు వాటిల్లుతాయి. ఆరోగ్య పరమైన శ్రద్దలు వహించండి. విద్యార్థులకు ఎంత చదివినప్పటికీ బుర్రకి ఎక్కడం లేదని ఆందోన చెందకండి. కొద్దిపాటి అలసట, మానసిక ఒత్తిడి తరువాత విజయం సంప్రాప్తిస్తుంది. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలం. నూతన పనులు, ప్రాజెక్ట్ వంటి వాటివి మొదలు పెట్టక పోవడం మంచిది. ప్రతినిత్యం స్వామివారికీ జిల్లేడువత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు.

వృశ్చికం: ఈ వారం మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు మంచి అనుకూలత, ఆర్థిక పరమైన అభివృద్ధి, వ్యాపారస్తులకు గౌరవంతో కూడిన అభివృద్ధి, తృప్తి లభిస్తుంది. స్నేహితుల వలన అనుకోని లాభాలు కలసివస్తాయి. విద్యార్థులు పోటీపరీక్షలలో అనుకున్న విజయాలను అందుకుంటారు. అలాగే నూతన విద్య, ఉద్యోగప్రయత్నాలు మంచిఫలితాలను ఇస్తాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సాఫ్ట్ వేర్ రంగంవారికి, చిరువ్యాపారులకు ఊరట లభిస్తుంది. వివాహ ప్రయత్నాలకు మంచి సమయం,అయితే ప్రయత్నాలు ముమ్మరంగా, పట్టుదలతో చేస్తే కానీ ఫలితాలు కానరావు. జాప్యం,నిర్లక్ష్యం పనికిరాదు. ప్రతి నిత్యం దుర్గా అమ్మవారి స్తోత్రం పఠించండి చెప్పదగిన సూచన..

ధనస్సు: మనోవాంఛలు తీరే అవకాశాలున్నాయి. గతంలో ఉన్న మానసికఆందోళనలు తగ్గి, మానసిక ధైర్యం ఏర్పడుతుంది. అనుకున్న పనులు సాధిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, అలాగే స్థిరాస్తి వృద్ధి చేసుకునే ప్రణాళికలు చేసేవారికి అనుకూలమని చెప్పవచ్చు. నూతన ఉద్యోగప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఆర్థికాభి వృద్ధి, శత్రువులే మిత్రులయ్యే అవకాశాలున్నాయి. అయితే మనసులో సంకోచం ఉంటుంది. అది బయట తెలీకుండా మాట్లాడుతూ జాగ్రత్త వహించి, తప్పెంచక, తానొప్పించక అన్నట్లు ప్రవర్తిస్తారు. మొండి బాకీలు వసూలు అయ్యే అవకాశములు ఉన్నాయి. ఈరాశి వారు ప్రతినిత్యం కుబేరవత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం

మకరం: కొంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పవచ్చు. మీరు వృత్తి యందు మరింత శ్రద్ద వహించండి, ఏమాత్రం నిర్లక్ష్య ధోరణితో ఉన్నా, పైఅధికారులతోవివాదాలు, మీరు ఇన్నాళ్లు పడ్డ కష్టం, శ్రమకి గుర్తింపు పోయే అవకాశం ఉంది. ఒక్కమాటలో చిన్న తప్పుకు పెద్దశిక్షని చెప్పవచ్చు. దానివలన మీ మంచి పేరుమీద బురద చల్లే అవకాశాలు ఉంటాయి. అలాగే మాట్లాడేటప్పుడు ఇతరులను దృష్టిలో ఉంచుకుని, వారి అంతరంగం గ్రహించి సమాధానం చెప్పడం మంచిది. ఒకటి అంటే ఇంకొకటి అర్ధం అయ్యి వివాదాలకు తావు అవుతుంది. శత్రువర్గం పెరిగే అవకాశాలు లేకపోలేదు.ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. సాధ్యమైనంత సమయం జీవిత భాగస్వామి, కుటుంబం సభ్యులతో గడపడం మంచిది. కొంత ప్రశాంతత లభిస్తుంది. ఈరాశి వారు మంగళవారం మరియు శనివారం నాడు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం.

కుంభం: కొంత అనుకూలమైన ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు అనుకున్నంత లాభాలు లేకున్నా స్వల్ప లాభాలతో సాగుతుంది. కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు తమ తెలివి తేటలకు పరీక్షా సమయంగా చెప్పవచ్చు. మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో గ్రహించి జాగ్రత్తగా వ్యవరించం డి. ఎవరితో పడితే వారితో రహస్యాలు చెప్పడం, మీరు ఇబ్బందిలో పడే మాటలుమాట్లాడ డం జరుగవచ్చు.వాటి వలన కొద్దిపాటి అవమానాలు ఉండవచ్చు. పైఅధికారులతో ఒత్తిడి ఉండవచ్చు. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు, చిన్న పాటి మనస్పర్థలు వలన మానసిక ప్రశాంతత లోపించే చాన్స్ ఉంది. జాగ్రత్త వహించండి ఈ రాశి వారు నలుపు వత్తులతో దీపారాధన చేయడం అలాగే గుగ్గిలంతో ప్రతిరోజు ధూపం వేయడం చెప్పదగిన సూచన.

మీనం: ఈవారం ప్రతికూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా ఒక పని మీద, వ్యవహారాలమీద చేసే ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. అనుకున్న ఫలితాలు ఆలస్యం అవ్వడం వృధాగా తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఋణాలు, లోన్లు విషయంలో ఒత్తిడి రావాల్సిన ఋణాలు కూడా తిరిగి ఇవ్వక మిమ్మల్నిఇబ్బందికి గురిచేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామికి మీ పరిస్థితులు అర్ధం అయ్యేలా చెప్పండి లేదంటే సరిగా అర్ధంచేసుకోక అపార్దాలతో మనస్పర్థలు వచ్చే అవకాశాలున్నాయి. ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. ఈ మానసిక ఆందోళనల వలన చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలున్నాయి కార్యాలయంలో, ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో జిల్లేడు గణపతిని పెట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.

సోమేశ్వర్ శర్మ
వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
84669 32223
90141 26121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News