Friday, April 19, 2024

నెత్తురోడిన చోట కొత్త పట్టాలపై వందేభారత్.. రైల్వే మంత్రి భావోద్వేగం

- Advertisement -
- Advertisement -

బాలాసోర్: ఒడిషాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ జిల్లాలోని రైలు మార్గం మీదుగా పునరుద్ధరించిన పట్టాలపై సోమవారం వందేభారత్ రైలు వెళ్లింది. ఈ తొలి హైస్పీడ్ ప్యాసింజర్ రైలు హౌరా పురి వందేభారత్ మూడు ప్రమాదాలు జరిగిన చోట ట్రాక్‌లపై వెళ్లుతున్న దశలో అక్కడ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇతరులు ఉన్నారు. డ్రైవర్ల వైపు మంత్రి అభివాదం చేశారు. అంతకు ముందు ఈ రూట్లో గూడ్స్ రైలు వెళ్లిన దశలో రైల్వే మంత్రి చేతులు జోడించి కొద్ది సేపు ప్రార్థన చేశారు. ఈ ప్రాంతంలో పూర్తిగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్ మరమ్మతు పనుల పర్యవేక్షణకు రైల్వే మంత్రి ఇక్కడ ఉన్నారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో బహానగా బజార్ స్టేషన్‌ను వందేభారత్ రైలు దాటింది. ఆదివారం రాత్రి ఈ ప్రాంతంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయినట్లు రైల్వే మంత్రి వివరించారు.

యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను చేపట్టారు. ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఇకపై సాగే ప్రయాణాలు సాగాల్సి ఉంటుంది. అందుకే తాను ఇక్కడ బసచేసి మరమ్మతు పనులను పరిశీలించినట్లు, ఇప్పుడు ఈ పట్టాల మీదుగా వందేభారత్ వెళ్లినట్లు ఆ తరువాత మంత్రి విలేకరులకు తెలిపారు. ఆదివారం రాత్రి ఈ రూట్లోనే బొగ్గు లోడ్‌తో వైజాగ్ పోర్టు నుంచి రూర్కేలా స్టీల్ ప్లాంట్‌కు గూడ్స్ రైలు వెళ్లింది. మూడు యాక్సిడెంట్లు జరిగిన చోట ట్రాక్‌పై అన్ని రైళ్లు ఇప్పుడు చాలా తక్కువ వేగంతో సాగుతున్నాయి. ఈ మార్గంలో ఇక అన్ని రైళ్లు యధావిధిగా ప్రయాణించేందుకు వీలేర్పడిందని రైల్వే మంత్రి తెలిపారు. ఈ ట్రాక్‌పైనే భువనేశ్వర్ న్యూఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ కూడా సోమవారం తెల్లవారుజామున వెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News