Tuesday, April 16, 2024

పట్టాలపై పశువులతో కష్టాలే

- Advertisement -
- Advertisement -

Vande Bharat train hits bull in Valsad

ఎద్దును ఢీకొన్న వందేభారత్
దెబ్బతిన్న డ్రైవర్ క్యాబిన్
నెలరోజుల్లో ఇది మూడో బ్రేక్

ముంబై : వందే భారత్ రైలు మరోసారి ప్రమాదానికి గురైంది. ముంబై గాంధీనగర్ వందేభారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ శనివారం ఓ ఎద్దును ఢీకొంది. దీనితో ఇంజన్ ముందటి భాగం స్వల్పంగా దెబ్బతినడంతో దీనిని కొద్ది సేపు నిలిపివేసి తరువాత ముందుకు పంపించారు. గుజరాత్‌లోని అతుల్ రైల్వేస్టేషన్ సమీపంలో వందేభారత్‌కు పశువుతో బ్రేక్ పడింది. ప్రధాని నరేంద్ర మోడీ అట్టహాసంగా ముంబై గాంధీనగర్ మధ్య ప్రారంభించిన ఈ రైలుకు ఇటువంటి ప్రమాదాలు జరగడం ఈ నెలలో ఇది మూడోసారి. సెప్టెంబర్ 30న ఈ రైలు ఆరంభం అయింది. ఉదయం 8.20 గంటకు పట్టాలపై ఎద్దునిలిచి ఉంది, దీనిని ఢీకొంటూనే రైలు ముందుకు సాగాల్సి వచ్చిందని, తరువాత పావుగంట సేపు రైలును నిలిపివేశారని అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, అయితే రైలు ముందు భాగం కొంత దెబ్బతిందని వివరించారు. అయితే దెబ్బతిన్న ఎద్దు పరిస్థితి ఏమిటనేది వెల్లడికాలేదు.

డ్రైవర్ కోచ్ ముందు భాగం విరిగిందని, ఆ తరువాత రైలు మామూలుగానే సాగిందని వెస్టర్న్ రైల్వే పౌర సంబంధాల అధికారి సుమిత్ ఠాకూర్ తెలిపారు. ఇంతకు ముందు ఈ నెల 6వ తేదీనే వందేభారత్ ట్రైన్ గుజరాత్‌లోని వాట్వా, మణినగర్ స్టేషన్ల మధ్య బర్రెలను ఢీకొంటూ వెళ్లింది. తరువాత మరుసటిరోజు ఏడవ తేదీన ఈ ట్రైన్ గుజరాత్‌లోని ఆనంద్ వద్ద ఓ ఆవును ఢీకొంది. ఈ రెండు సందర్భాలలో ఇప్పటిలాగానే ట్రైన్ ముందు భాగాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వందేభారత్ రైలును దేశీయంగా రూపొందించి నిర్మించారు. ఇది గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. గుజరాత్ రాజధానిని, మహారాష్ట్ర రాజధానిని కలిపే ఈ వందేభారత్ రైలు ఈ సీరిస్‌లో మూడో రైలు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News