Sunday, April 28, 2024

దేశంలో ఇక వందేసాధారణ్ రైళ్లు ఈ వారంలో ట్రయల్ రన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో త్వరలో వందే సాధారణ్ రైళ్లు రాబోతున్నాయి. రిజర్వేషన్ల ఏర్పాట్లు లేని వేలాది మంది ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు ఈ సాధారణ రైళ్లను భారతీయ రైల్వే రూపొందించింది. సంబంధిత రైళ్ల ట్రయల్ రన్‌ను ఈ వారంలో నిర్వహించనున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. అధునాతన ఏర్పాట్లతో, అత్యధిక ఛార్జీలతో ఇటీవలే భారతీయ రైల్వే దేశంలో 34 వరకూ వందేభారత్ రైళ్లను నడిపిస్తోంది. ఇప్పుడు సాధారణ్ రైళ్లు రానున్నాయి. వందేభారత్ రైళ్ల తరహాలోనే వందేసాధారణ్ రైళ్లు ఉంటాయి. ఇవి గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 22 కోచ్‌లతో ఉండే వీటిలో ఎనిమిది అన్‌రిజర్వుడ్ బోగీలు ఉంటాయి. వీటిలో 1800 మంది వరకూ ప్రయాణికులు వెళ్లేందుకు వీలుంటుంది. తమిళనాడులోని పెరంబుదూరు కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలును రూపొందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News