Wednesday, September 10, 2025

మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. తండ్రైన హీరో వరుణ్ తేజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగా అభిమానులకు గుడ్‌న్యూస్. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్ (Varun Tej) తండ్రయ్యారు. నవంబర్ 2023లో వరుణ్, లావణ్యలు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ ఏడాది మేలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈ దంపతులు ప్రకటించారు. ఈరోజు (సెప్టెంబర్ 10న) వరుణ్ భార్య లావణ్య త్రిపాఠి రెయిన్‌బో హాస్పిటల్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే వరుణ్ పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా సెట్స్‌ నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లి వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : భారీ పోరాటాలతో కీలక షెడ్యూల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News