Friday, April 26, 2024

‘వసంత కోకిల’ ట్రైలర్ ను విడుదల చేసిన మెగాస్టార్

- Advertisement -
- Advertisement -

మధుర ఫిలిమ్ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు బాబీ సింహా హీరోగా రమణన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వసంత కోకిల’. ఇందులో బాబీ సింహా సరసన కాశ్మీర హీరోయిన్‌గా నటిస్తోంది. 40 ఏళ్ల క్రితం కమల్ హాసన్, శ్రీదేవి నటించిన సూపర్ హిట్ టైటిల్ ‘వసంతకోకిల’తో ఈ సినిమా రూపొందుతుండటంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను తెలుగులో రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళం, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను అధికారికంగా విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి రీలిజ్ చేయగా… కన్నడ ట్రైలర్‌ను స్టార్ హీరో శివరాజ్ కుమార్ విడుదల చేశారు. మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాబీ సింహా రుద్ర పాత్రలో కనిపించనున్నాడు. రమణన్ పురుషోత్తమ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రేష్మి సిన్హా, రజనీ తల్లూరి, రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News