Sunday, October 6, 2024

తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న బిజెపిని తరిమేయండి

- Advertisement -
- Advertisement -

బిజెపి నాయకులను కెసిఆర్ తిట్టడం వంద శాతం కరెక్ట్
రాష్ట్రంపై బిజెపి విషం చిమ్ముతోంది : మంత్రి వేముల

Vemula Prashanth Reddy comments on BJP

మన తెలంగాణ/నిజామాబాద్ : మందికి పుట్టిన బిడ్డను ముద్దాడి మా బిడ్డే అనే నీచ స్థాయికి బిజెపి దిగజారిందని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న బిజెపిని తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బిజెపి నాయకులను తిట్టడం వంద శాతం కరెక్టేనని, తెలంగాణపై బిజెపి విషం చిమ్ముతుందని ఆరోపించారు. బాల్కొండ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నిధులు ఇవ్వడంలో వివక్ష చూపడమే కాకుండా తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలిపే కుట్రలో భాగమేనా అన్న అనుమానాన్ని మంత్రి వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయి 8 ఏండ్లు అవుతున్నా.. స్వయంగా ప్రధానే రాష్ట్ర విభజన మీద మాట్లాడున్నారంటే కచ్చితంగా తెలంగాణపై జరుగుతున్న కుట్రలో భాగమేనన్నారు. దీనిపై ప్రజలు,ముఖ్యంగా యువత ఆలోచన చేయాలన్నారు. బిజెపి నాయకులను ప్రజలే ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రశాంతరెడ్డి పిలుపునిచ్చారు.

పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు మాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు ఇచ్చినట్లు తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బిజెపి ఎంపిలకు తెలంగాణ ప్రాంత అభివృద్ధి మీద సోయిలేదన్నారు. రాజకీయాలు వేరైనా ప్రజల అభివృద్దే అంతిమలక్ష్యమని, కానీ బిజెపి తొలి నుంచి తెలంగాణపై కక్షపూరితంగానే వ్యవహరిస్తోందన్నారు. కెసిఆర్ సిఎం అయిన తర్వాతే తెలంగాణ పల్లెలు అభివృద్ధి చెందాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News