Wednesday, December 6, 2023

అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై విహెచ్ ఫైర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దమ్ముంటే రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో తనపై పోటీ చేయాలని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీపై అసద్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన మండిపడ్డారు. నాన్ సెక్యులర్ అయిన ఓవైసీ సెక్యులర్ అయిన రాహుల్ గాంధీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఓవైసీ ఎప్పుడూ దేశంలో ఉన్న ముస్లింల గురించే తప్ప హిందువుల గురించి పట్టించుకోరని విహెచ్ ధ్వజమెత్తారు.

ఓల్డ్ సిటీలో ఓవైసీని షేర్ అని పిలుస్తారని, మీరు నిజంగా షేర్ అయితే వయనాడ్ వెళ్లి రాహుల్ గాంధీపై పోటీ చేసి గెలవాలని విహెచ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చి ఎందుకు పోటీ చేస్తారు? రాహుల్ కు ఏం అవసరం అని ఆయన ప్రశ్నించారు. లాలు ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నేతలపై మాట్లాడుతూ పరోక్షంగా బిజెపికి లబ్ధి జరిగేలా పనిచేయడమే ఓవైసీ పని అని ఆయన కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News