Friday, February 3, 2023

ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ

- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో విజయ్ దేవరకొండ బుధవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆఫీసుకు వెళ్లారు. లైగర్ పెట్టుబడులకు సంబంధించి ఈ హీరోను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అతని రెమ్యునరేషన్, ఎవరేవరు పెట్టుబడులు పెట్టారు లాంటి అంశాలపై ఆరా తీయనున్నారు. కాగా, ఇప్పటికీ ఈ వ్యవహారంలో పూరి జగన్నాథ్, ఛార్మీలు విచారణకు హాజరయ్యారు. అలాగే ఇతర భాగస్వామ్యులను కూడా విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. లైగర్ సిన్మాకు విదేశాల నుంచి, రాజకీయ నేతల ఖాతాల నుంచి డబ్బు బదిలీ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles