Sunday, April 14, 2024

కలియుగ రాముడిగా విజయ్ దేవరకొండ

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‘ సినిమా టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హోల్‌సమ్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ‘ఫ్యామిలీ స్టార్‘ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నారు.

ఇక గోపీ సుందర్ కంపోజ్ చేసిన ’దేఖొరో దెఖో..’ సాంగ్ తో హీరో క్యారెక్టరైజేషన్ ను వర్ణిస్తూ సాగిన ఈ టీజర్ ఆకట్టుకుంది. సర్ నేమ్ కు సరెండర్ అయి, ఫ్యామిలీ అంటే వీక్ నెస్ ఉన్న కలియుగ రాముడిగా హీరో విజయ్ దేవరకొండను ఈ టీజర్‌లో చూపించారు. దేవుడి పూజతో సహా ఇంటి పనులన్నీ చేసుకుంటూ తన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకుంటుంటాడు హీరో. వాళ్ల జోలికి ఎవరైనా వస్తే మడత పెట్టి కొడతాడు. ఈ సమ్మర్‌కు పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ‘ఫ్యామిలీ స్టార్‘ సినిమా ఉండబోతున్నట్లు టీజర్ క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News