Sunday, December 3, 2023

ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్‌గా విజయశాంతి నియామకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లు, మేనిఫెస్టోతో ముందుకెళుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీలను శనివారం నియమించింది. ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్, కన్వీనర్‌గా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన లేడీ ఫైర్ బ్రాండ్ విజయశాంతిని నియమించింది. ఆమెతో పాటు ఈ కమిటీలో 15 మంది సీనియర్ నేతలను కన్వీనర్లుగా కాంగ్రెస్ పార్టీ నియమించింది.

సీనియర్ నేతలు మల్లురవి, కోదండరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సమరసింహారెడ్డి, పుష్పలీల, అనిల్, రాములు నాయక్, పిట్ల నాగేశ్వరరావు, ఒబెదుల్లా కొత్వాల్, రమేష్ ముదిరాజ్, పారిజాత రెడ్డి, సిద్ధేశ్వర్, రామ్మూర్తి నాయక్, ఇబ్రహీం, దీపక్ జాన్ ఈ కమిటీలో కన్వీనర్లుగా ఉన్నారు. మహేశ్వరం టికెట్ ఆశించి భంగపడ్డ మేయర్ పారిజాత రెడ్డికి సైతం ఈ కమిటీలో చోటు కల్పించారు. సినీ నటీ విజయశాంతికి రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతితో క్యాంపెయినింగ్ చేయిస్తే కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News