Tuesday, October 15, 2024

ఎసిబి వలలో గ్రామ కార్యదర్శి

- Advertisement -
- Advertisement -

కొండాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డాడు. సినీ ఫక్కీలో అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తన తమ్ముడి పేరు మీద ఉన్న ఇంటిని తన పేరుకు మార్చేందుకు గాను మాచేపల్లి అప్సర్ అనే వ్యక్తి గ్రామ కార్యదర్శిని గత మార్చి 21న కలిసి కోరారు.డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని అభ్యర్థించాడు. అయితే దీనికి గాను 20 వేలు లంచం ఇవ్వాలని కార్యదర్శి షకీల్ చెప్పగా, చివరకు 7 వేలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అఫ్సర్ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు.

ఏడు వేలలో 5 వేల రూపాయలను శుక్రవారం నాడు మండల విద్యా శాఖ కార్యాలయం వద్ద షకీల్ తీసుకుంటుండగా, ఎసిబి డిఎస్‌పి సుదర్శన్ ఆధ్వర్యంలో వల పన్ని పట్టుకున్నారు. అధికారులు అనంతరం పంచాయితీ కార్యాలయం వద్ద నాలుగు గంటల పాటు విచారణ జరిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అనేక మంది అక్కడ గుమికూడారు. తమ వద్ద కూడా లంచం తీసుకున్నారని వారు పేర్కొన్నారు.దాడుల్లో డిఎస్‌పి తో పాటు సిఐలు రమేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పంచాయితీ కార్యదర్శిని అరెస్టు చేసి రిమాండ్ చేస్తున్నట్లు డిఎస్‌పి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News