Sunday, May 11, 2025

విరమణ.. ఉల్లంఘన

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు
తెలిపిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి
ఇరుదేశాల డిజిఎంఒల చర్చల్లో కుదిరిన ఒప్పందం తక్షణమే
అమలులోకి వచ్చిందని మిస్రీ ప్రకటన 12న మరోసారి
డిజిఎంఒలు సమావేశమవుతారని వెల్లడి ధ్రువీకరించిన పాక్
ప్రకటన వెలువడిన గంటల్లోనే భారత్ సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన
పాక్ డ్రోన్లు శ్రీనగర్ సైనిక కార్యాలయం వరకు వచ్చిన
దాయాది డ్రోన్లు కూల్చేసిన భారత బలగాలు సరిహద్దు
పట్టణాల్లో పూర్తి బ్లాక్ అవుట్ ప్రకటించిన భారత ప్రభుత్వం

శ్రీనగర్: కాల్పుల విరమణ ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ దానికి తూట్లు పొడిచింది. శని వారంనాడు మధ్యా హ్నం ఇరుదేశాల నడుమ జరిగిన అవగాహనను అక్కడితోనే వదిలిపెట్టింది. రాత్రికల్లా సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్లను ప్రయోగించింది. జమ్మూ కశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో కాల్పులు జరపడంతో పాటు పీర్‌పంజాల్ ప్రాంతంలోని గగనతలంలో డ్రోన్లు కని పించాయి. తద్వారా ద్వైపాక్షిక అవగాహనను పాక్ ఉల్లంఘించిందని, కొన్ని డ్రోన్లు భారత భూభాగంలోకి వచ్చి తిరిగి వెళ్లాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శ్రీనగర్ లోని పాత నగరంపైకి కూడా పాక్ డ్రోన్ ప్రయోగించినట్లు తెలిసింది. అదే సమయంలో భారీగా కాల్పుల శబ్దాలు కూడా వినిపిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.

ఈ మేరకు శనివారంనాడు రాత్రి ‘ఎక్స్’లో ఆయన డ్రోన్ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఇది కాల్పుల విరమణ ఒప్పందం ఎంత మాత్రం కాదని పేర్కొన్నారు. శ్రీనగర్ నడిబొ డ్డున క్షిపణి రక్షణ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. అదే సమయంలో పాక్ సైన్యం నియంత్రణ రేఖ వెంట అఖ్నూర్, జమ్మూ, రాజౌరి, మెంధార్ సెక్టార్‌లలో కాల్పులకు తెగ బడ్డట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జమ్మూ, శ్రీనగర్, కథువాతో పాటు సరిహద్దుల్లో పూర్తిగా బ్లాక్‌ఔట్ అమలు చేశారు. ఆయా ప్రాంతాల ప్రజలు చీకట్లోనే మగ్గాల్సివచ్చింది. రాజస్థాన్‌లోని జైస ల్మీర్, బార్మర్, పంజాబ్‌లోని అమృత్ సర్, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్ లో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో కూడా డ్రోన్లు కనిపించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి ప్రకటించారు. సరిహద్దు గ్రామాల్లో కూడా విద్యుత్ నిలిపివేశామన్నారు.

అత్యంత దుర్మార్గం : విదేశాంగ కార్యదర్శి మిస్రీ
పాక్ ఉల్లంఘనలను కేంద్రం ధ్రువీకరించింది. విదేశాంగ కార్యదర్శి మిస్రీ రాత్రి పొద్దుపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పాక్ ఉల్లంఘనలను నిరోధించడానికి భారత సైన్యం సర్వసన్నద్దంగా ఉందన్నారు. కాల్పుల విరమణను ఉల్లం ఘించడం అత్యంత దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News