Tuesday, March 5, 2024

21, 22 తేదీల్లో తిరుమల విఐపి దర్శనాలు రద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : శోభకృత నామ ఉగాది పండుగను పురస్కరించుకుని తిరుపతి శ్రీవారి ఆలయంలో ఈ నెల 21,22 తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టిటిడి జేఈఓ వీరబ్రహ్మం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని అన్నారు. ఈ నెల 22న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరుగనుందన్నారు.

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 3 గం.లకు సుప్రభాతం, 6 గం.లకు శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్ప స్వామికి విశేష సమర్పణ చేస్తారన్నారు. ఉదయం 7 నుండి 9 గం.ల నడుమ విమాన ప్రాకారం, ధ్వజ స్థంభం చుట్టూ ఊరేగింపుగా శ్రీవారు ఆలయంలోకి ప్రవేశిస్తారన్నారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News